మందు పార్టీ ఇస్తానని పిలుచుకుని వెళ్లి ఏం చేశాడంటే , మందు ఎక్కువై కోపం వచ్చి !
మందు పార్టీ చేసుకుందామని స్నేహితుడిని పిలిచిన యువకుడు అతను ఎక్కువగా మద్యం తాగుతున్నాడని చెప్పి పొదల్లో చంపేసి పడేశాడు, బెంగళూరులో ఇలాంటి విచిత్రం సంఘటన చోటుచేసుకుంది.బెంగుళూరులో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది బ్యాచిలర్లు అప్పుడప్పుడు మందు పార్టీలు చేసుకోవడం మామూలే. బెంగళూరులో బ్యాచిలర్ పార్టీలు జోరుగా జరుపుకుంటారు.
మందు పార్టీ చేసుకోవాలని పిలిచి నస్నేహితుడికి విపరీతంగా మద్యం తాగించాలని అనుకున్నాడు. తరవాత నాకు తాగడానికి మందు సరిపోదని ఫ్రెండ్ చెప్పాడు. నాతో పాటు రూమ్ లో తోడుగా ఉండేందుకు నువ్వు అంగీకరిస్తే నువ్వు ఎంతతాగితే అంత మద్యం తీసిస్తానని ఇస్తానని చెప్పాడు. అతని మాట విని మరికొంచెం మద్యం సేవించాడు. ఎంత కావాలంటే అంత మద్యం తాగురా అని చెప్పి రూమ్ లో నుంచి బయటకు వెళ్లిపోయారు. తరువాత ఇద్దరూ మద్యం బాటిల్స్ తీసుకుని ఖాళీ ప్రదేశం దగ్గరకు వెళ్లారు.

అయితే తన స్నేహితుడికి మద్యం తీసిస్తానని పిలుచుకుని వెళ్లిన యువకుడు అతనితో పాటు విస్కీ తాగుతున్నట్లు నటించాడు. మద్యం మత్తులో ఉన్న స్నేహితుడిని ఖాళీ స్థలం దగ్గరకు పిలుచుకుని వెళ్లాడు. తరువాత పొడవాటి కండువా తీసి ఖాళీ ప్రాంతంలో కూర్చుని మద్యం సేవిస్తున్న స్నేహితుడి మెడకు వెనుక నుంచి బిగించి ఊపిరాడకుండా చెయ్యడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
తరువాత భయపడి స్నేహితుడి మృతదేహాన్ని ఏమి చేయాలో తెలియక మృతదేహాన్ని ఖాళీ ప్రాంతంలోని పొదలో విసిరాడు. బెంగళూరులోని బాగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. జితేంద్ర సింగ్ అనే వ్యక్తిని అతని స్నేహితుడు బాబూ లాల్ సింగ్ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మద్యం ఎక్కువ అడిగాడని స్నేహితుడిని హత్య చేశాడని తెలుసుకున్న బాగలూరు పోలీసులు షాక్ అయ్యారు. అయితే ఈ హత్యకు వేరే కారణాలు ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications