Bengaluru: బీడీఏలో రూ, కోట్ల విలువైన భూమి కబ్జా, కాంపౌండ్ వేసిన మాజీ కార్పోరేటర్ కథ ?

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు సిటీ పరిధిలో అడుగు భూమి కొనుగోలు చెయ్యాలంటే కనీసం 7 వేల రూపాయలకు పైగా పెట్టాలి. బెంగళూరులో ఒక్క అడుగు భూమి 7 వేల నుంచి లక్షల రూపాయల ధర పలుకుంది. బెంగళూరులో ఒక ఇంటి స్థలం కొనుగోలు చెయ్యాలంటే కనీసం రూ. 50 లక్షలు జోబులో ఉండాలి. ఇక బీడీఏ ఇంటి స్థలాలు అయితే కోట్ల రూపాయల పలుకుతున్నాయి. ఓ రాజకీయ నాయకుడు బీడీఏ ఆస్తిని కబ్జా చేసి కాంపౌండ్ వేసి దర్జాగా అనుభవిస్తూ ఇప్పుడు అడ్డంగా చిక్కిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఐటీ హబ్ బెంగళూరులో రాజకీయ ప్రముఖులు తమ ప్రభావాన్ని ఉపయోగించి ప్రభుత్వ ఆస్తులను కబ్జా చెయ్యడం సర్వసాధారణం అయిపోందని ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది రాజకీయ నాయకులు నేరుగా భూమిని ఆక్రమించుకోకుండా వేరొకరి పేరుకు బదిలీ చేసి తరువాత ఆ ఆస్తిని వాళ్లు అనుభవిస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు బెంగళూరులో ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి.

 Bengaluru police have arrested a former corporator who had encroached on BDA land worth crores of rupees.

అయితే బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ)కి చెందిన ఆస్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ బెంగళూరులోని మంగమ్మనపాళ్య వార్డు మాజీ కార్పొరేటర్ జగదీష్‌ను బెంగళూరు మెట్రోపాలిటన్ టాస్క్ ఫోర్స్ (బీఎంటీఎఫ్) పోలీసు అధికారులు అరెస్టు చేశారు. బీడీఏకి సంబంధించిన భూమిలో ప్రజల రాకపోకలకు రహదారి మూసివేశారు. ప్రభుత్వానికి చెందిన రోడ్డులో ప్రైవేట్ వ్యక్తులు కాంపౌండ్ ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే మాజీ కార్పోరేటర్ జగదీష్ మీద ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అధికారులకు పలువురు ఫిర్యాదులు చేశారు. బీడీఏ నిర్మించిన ఐటీఐ లేఅవుట్ ప్రజల కోసం ఖాళీగా వదిలిన స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారుల విచారణలో తేలింది. ఘటనా స్థలాన్ని బీడీఏ అధికారులతో కలిసి పరిశీలించిన బీఎంటీఎఫ్ పోలీసు అధికారులు బీడీఏ అధికారుల ఫిర్యాదు మేరకు బీబీఎంపీ మాజీ కార్పొరేటర్‌ జగదీష్ ను అరెస్టు చేశారు. బీడీఏ స్థలం కబ్జా కేసులో బెంగళూరు మాజీ కార్పొరేటర్‌ జగదీష్‌ ను కోర్టు ముందు హాజరుపరిచిన బీఎంటీఎఫ్‌ అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+