పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు, కాంగ్రెస్ ఎంపీకి నోటీసులు, ఐటీ హబ్ పోలీసుల దెబ్బకు రివర్స్!
బెంగళూరు విధానసౌధలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్ర విచారణ చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నాసీర్ హుసేన్‌ను అభినందించేందుకు బెంగళూరు వచ్చి వెళ్లిన ఆయన అనుచరుల మీద పోలీసులు నిఘా వేశారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో బాంబు పేలుడు కేసు పోలీసులకు తలనొప్పి తయారైయ్యింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసు నిందితుల గుర్తించాలని కర్ణాటక పోలీసు శాఖ శత ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో బెంగళూరులోని విధానసౌధలో పాకిస్థాన్ కు అనుకూలంగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసు పోలీసులకు సవాలుగా మారింది. పాకిస్థాన్ జిందాబాద్ నినాదాల కేసులో విధాన సౌధలో తీసిన ఓ వీడియో ఎఫ్ఏఎస్ఎల్ ( FASL) పరీక్షకు పంపించారు. ఇందులో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని ఖచ్చితంగా ఉందని నివేదిక వచ్చిందని తెలిసింది.

ఈ కేసులో నిందితులైన ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరు నగరానికి చెందిన మునావర్, కర్ణాటకలోని హావేరి జిల్లా బ్యాడగికి చెందిన మొహమద్ షఫీ నాశిపుడి అరెస్ట్ చేశారు.నిందితులను విచారణ చెయ్యడానికి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులోని నిందితుడు బ్యాడగికి చెందిన మొహమ్మద్ నాశిపుడి దేవుడి సాక్షిగా తాను పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చెయ్యలేదని అంటున్నాడు
రాజ్యసభ ఎన్నికల్లో గెలిచిన నాసీర్ హుసేన్ ను అభినందించడానికి మేము విధాన సౌధకు వచ్చామని మొహమ్మద్ నాశిపుడి అంటున్నాడు. కాంగ్రెస్ ఎంపీ నాసీర్ హుస్సేన్ ను అభినందించి తాము వెళ్లిపోయామని నిందితులు అంటున్నారు. విధాన సౌధలో పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్లను బెంగళూరు పోలీసులు విచారణ చేసి వారి నుంచి సాక్షాలు సంపాధించారు.
నిందితులు పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని తెలిసింది. రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుసేన్ కు నోటీసులు ఇవ్వడానికి బెంగళూరు పోలీసులు సిద్దం అయ్యారు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని నమోదు అయిన కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్ కు కష్టాలు ఎదురైనాయి. ఈ కేసులో చాలా మందిని విచారించాలని బెంగళూరు పోలీసులు సిద్దం అయ్యారు. ఇప్పుడు రాష్ట్రసభ సభ్యుడు నాసీర్ హుసేన్ ను విచారణ చెయ్యడానికి బెంగళూరులోని విధానసౌధ పోలీసులు సిద్ధం అయ్యారు.

రెండు రోజులలో నాసీర్ హుసేన్ కు నోటిసుతు ఇచ్చే అవకాశం ఉందని ఓ సీనియర్ పోలీసు అధికారి కన్నడ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో కొంత మంది సీనియర్ పోలీసు అధికారులు ఈ సంఘటనపై సీరియస్ అయ్యారని తెలిసింది. విధానసౌధ భద్రతా సిబ్బంది కూడా నాయకుల మీద అసంతృప్తితో ఉన్నారని వెలుగు చూసింది. విధాన సౌధకు వచ్చే నాయకులతో పాటు కొందరు వస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు అంటూ వారి కార్లలో వచ్చారని, మేము వారిని అడ్డుకుంటే మామీద కేకలు వేస్తున్నారని ఆరోపిస్తున్నారు
అలాంటి వాళ్లను విధాన సౌధలోకి వెళ్లకుండా అడ్డకోలేకపోతున్నామని, పాస్ లు లేకుండా వచ్చే సామాన్య ప్రజలను మాత్రమే మేము అడ్డుకుంటున్నామని విధానసౌధ భద్రతా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కన్నడ మీడియా తెలిసింది. ఇలాంటి విషయాలపై బెంగళూరు సిటీ పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విధా సౌధ భద్రతా సిబ్బంది మనవి చేస్తున్నారని తెలిసింది












Click it and Unblock the Notifications