తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: కొత్త గవర్నర్ తో రాజకీయాలు మారిపోతాయా ? పొలిటికల్ పంచ్, గతంలో బీజేపీ ఇన్ చార్జ్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక గవర్నర్ గా కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లెట్ ను నియమకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కేంద్ర మంత్రిగా పని చేస్తున్న తవార్ చంద్ గెహ్లెట్ ను కర్ణాటక గవర్నర్ గా నియమించడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఇంతకాలంలో కర్ణాటక గవర్నర్ గా వజుభాయ్ వాలా పదవి కాలం పూర్తి అయినా ఇంత వరకు ఆయనే కొనసాగారు. కర్ణాటకకు కొత్త గవర్నర్ గా తవార్ చంద్ గెహ్లెట్ రావడంతో అక్కడి రాజకీయాలు రంగు మారిపోయే అవకాశం ఉందని సమాచారం. గతంలో కర్ణాటక బీజేపీ ఇన్ చార్జ్ గా పని చేసిన తవార్ చంద్ గెహ్లెట్ ఇప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయ్యారు.

Illegal affair: ప్రియురాలిని లేపేశాడు, నీ పెళ్లాన్ని చంపేశానని భర్తకు ఫోన్, ఏం జరిగిందంటే ?Illegal affair: ప్రియురాలిని లేపేశాడు, నీ పెళ్లాన్ని చంపేశానని భర్తకు ఫోన్, ఏం జరిగిందంటే ?

కాలం గడిచిపోయింది

కాలం గడిచిపోయింది

రాష్ట్ర గవర్నర్ గా ఎవరికైనా ఐదు సంవత్సరాలు అవకాశం ఉంటుంది. కర్ణాటక గవర్నర్ గా వాజుభాయ్ వాలా నియమితులై దాదాపుగా ఏడు సంవత్సరాలు కావస్తోంది. 2014 సెప్టెంబర్ 1వ తేదీన గుజరాత్ కు చెందిన వాజుభాయ్ కర్ణాటక గవర్నర్ గా నియమితులైనారు. 2019కే వాజుభాయ్ వాలా పదవి కాలం పూర్తి అయిపోయినా ఆయన ఆస్థానంలోనే కొనసాగుతున్నారు. కర్ణాటకకు కొత్త గవర్నర్ ఎవ్వరూ రాకపోవడంతో ఇంతకాలం వాజూభాయ్ వాలానే గవర్నర్ గా కొనసాగారు.

 కర్ణాటక చరిత్రలో ఇదో రికార్డు

కర్ణాటక చరిత్రలో ఇదో రికార్డు

ఏ రాష్ట్రానికి అయినా గవర్నర్ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తి స్థానంలో కొత్త గవర్నర్ ను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కర్ణాటకలో ఆరు సంవత్సరాలకు పైగా పని చేసిన గవర్నర్లు ఉన్నారు. కర్ణాటక గవర్నర్ గా ఖుర్షీద్ అలం ఖాన్ 7 సంవత్సరాలు, మైసూరు రాజవంశస్తుడు జయచామరాజేంద్ర ఒడయార్ 6 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఇప్పుడు వాజుభాయ్ వాలా కూడా సుమారు 7 సంవత్సరాలు కర్ణాటక గవర్నర్ గా పని చేశారు.

బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ?

బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ?

గత ఏడాది కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చిన సమయంలో రాజకీయాలు మొత్తం గవర్నర్ వాజుభాయ్ వాలా చూట్టూ తిరిగాయి. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో వాజూభాయ్ వాలా హాట్ టాపిక్ అయ్యారు.

ఎవరికి లాభం ?

ఎవరికి లాభం ?

గత ఏడాది కర్ణాటక గవర్నర్ గా ఉమాభారతి లేదా సుమిత్రా మహాజన్ నియమితులు అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడం, కొత్త గవర్నర్ రాకపోవడంతో వాజుభాయ్ వాలా ఇంతకాలం ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కొత్తగా తవార్ చంద్ గెహ్లెట్ నియమితులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

English summary
Bengaluru: President of India Ram Nath Kovind appointed Thaawarchand Gehlot as governor of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X