మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మన రాజకీయ నాయకుల ఆస్తులు బయటకు వస్తాయి. రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు ప్రభుత్వ విలువ ప్రకారం బయటకు వచ్చినా ఆ ఆస్తుల వివరాలు వంద శాతం పక్కా నిజం అనే విషయం ఆస్తులు వివరాలు చెబుతున్న ఆ నాయకులకే తెలుసు. అలాంటి నాయకుల ఆస్తుల విలువ కేవలం కాగితాలకే పరిమతం అవుతాయని ప్రజలు అంటున్నారు.
బెంగళూరు రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆనియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ డీకే సురేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సందర్భంగా డీకే సురేష్ ఆయన ఆస్తులను ప్రకటించారు. దీంతో పాటు బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేష్ ఆయన అప్పుల వివరాలను అఫిడవిట్‌లో సమర్పించారు. కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఆయన సోదరుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తల్లి గౌరమ్మ నుంచి కూడా అప్పులు తీసుకున్నానని నామినేషన్ పత్రాల్లో వివరించారు.

కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల దగ్గర తీసుకున్న అప్పుల వివరాలు, వివిధ బ్యాంకుల్లో నగదు, ఎఫ్‌డీ, పెట్టుబడుల సమాచారాన్ని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. డీకే సురేశ్ తాను రైతు అని, వ్యాపారవేత్త అని, సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ మొత్తం ఆస్తుల విలువ రూ. 593. 04 కోట్లుగా ప్రకటించారు. మొత్తం ఆదాయంలో అద్దె, మూలధన లాభాలు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, వేతనాలు, వ్యవసాయ సంపాదన కలిపి ఉంటాయని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ప్రకటించారు.
బంగారం, బంగారు ఆభరణాలు 1 కేజీ 260 గ్రాములు (విలువ రూ. 21,35,500),వెండి వస్తువులు 4, 860 గ్రాములు ( విలువ రూ. 2,10,000), ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో తనకు రూ. 486.33 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని, ఇందులో రూ. 209.96 కోట్లు వారసత్వంగా వచ్చినవని, రూ. 276. 37 కోట్లు తన సొంతమని ప్రకటించారు. తాను రూ. 56. 06 కోట్లతో కొనుగోలు చేసిన ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 276.37 కోట్లు అని డీకే సురేష్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, వాణిజ్య సముదాయాల విలువ అఫిడవిట్‌లో వివరించారు. డీకే సురేష్ కు 21 ఎకరాల వ్యవసాయ భూమి, 27 ఎకరాల వ్యవసాయేతర భూమి ఉంది. ప్రస్తుతం వ్యవసాయ భూమి విలువ రూ. 32. 75 కోట్లు కాగా, వ్యవసాయేతర భూమి రూ. 210.47 కోట్లు ఉంది, అదే విధంగా 9 వాణిజ్య సముదాయాల విలువ రూ. 211.91 కోట్లుగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే సురేష్ కు రూ.150. 06 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. బ్యాంకు నుంచి రూ. 20.04 కోట్లు, శోభా డెవలపర్స్‌కు 99.16 కోట్లు, లులు మాల్‌కు రూ. 3 కోట్లు, సీఎంఆర్ ట్రస్ట్‌కు రూ15 కోట్లు అప్పు ఉన్నానని బెంగళూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ డీకే సురేష్ ప్రకటించారు. మొత్తం మీద దేశంలో అత్యంత శ్రీమంతులు అయిన ఎమ్మెల్యేల్లో ఒక్కరు అయిన కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ రూ. 500 కోట్లకు పైగా ఆస్తి ఉందని ప్రకటించారు.
ఇవే హైలెట్:
వివిధ కంపెనీల్లో పెట్టుబడి: రూ.2,14,87,182
ఎన్ఎస్ఎస్, పోస్టల్ సేవింగ్స్, బీమా పెట్టుబడి: రూ.15,17,394
గృహోపకరణాలు, ఫర్నిచర్ విలువ: రూ.73,58,771
కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కు అప్పులు ఇచ్చింది వీళ్లే:
డీకే శివకుమార్: రూ. 30,08,29,025 (సొంత అన్న)
సుమా రంగనాథ్: 30,00,000
శ్రీమతి గౌరమ్మ: రూ. 4,75,00,000 ( డీకే సురేష్ తల్లి)
ఐశ్వర్య శివకుమార్: రూ. 7,94,42,717 (డీకే సురేష్ కుమార్తె)
ఆకాష్ కెంపేగౌడ: రూ. 1,06,03,060
మొత్తం రుణం: రూ. 86,79,02,710
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications