గాలి జనార్దన్ రెడ్డి, సిట్టింగ్ మంత్రికి కోర్టు సమన్లు, రెడ్డి భార్య ఆస్తులు అటాచ్ చెయ్యండి, ఆర్డర్ !
బెంగళూరు/బళ్లారి: గతంలో కర్ణాటక రాజకీయాలను బళ్లారి జిల్లా శాసించింది. బళ్లారి జిల్లాకు చెందిన మైనింగ్ వ్యాపారులు కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పారు. గతంలో బళ్లారి రాజకీయాల దెబ్బకు కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇప్పుడు అదే బళ్లారి అక్రమ మైనింగ్ కేసుకు సంబందించి మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటక సిట్టింగ్ మంత్రికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో మూడుసార్లు ఎమ్మెల్యే అయిన నాగేంద్ర ఇటీవలే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు మొత్తం 10 మందికి ప్రజాప్రతినిధుల కేసులు వాదిస్తున్న ప్రత్యేక కోర్టు నోటీసులు ఇచ్చింది. బళ్లారిలో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2015లో కర్ణాటక లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (లోకాయుక్త సిట్) కేసులు నమోదు చేసింది.

ఇదే కేసుకు సంబంధించి ప్రస్తుత కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సహా 10 మందికి సమన్లు జారీ చేసింది. బెంగుళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసి కేసు విచారణ జులై 26వ తేదీకి వాయిదా వేసింది. బళ్లారిలో అక్రమ మైనింగ్ చేశారని పలువురు ప్రజాప్రతినిధులపై లోకాయుక్త అధికారులు కేసులు పెట్టారు.
అక్రమ మైనింగ్, అక్రమ ఆస్తుల సేకరణ కేసులో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు బి. నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా అధికారంలో ఉన్నారు. అలాంటి సందర్భంలో అక్రమ మైనింగ్‌కు సంబంధించి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు వారిద్దరికీ సమన్లు జారీ చేసింది.

మరో కేసులో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డికి కోర్టు షాకిచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి భార్య పేరుతో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. గాలి జనార్దన్ రెడ్డి భార్య గాలి అరుణ లక్ష్మి పేరిట ఉన్న 77కు పైగా ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి దంపతులకు చెందిన ఆస్తులను సీజ్ చేయాలంటూ సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసింది. ఇప్పుడు అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ చట్ట సవరణ చట్టం కింద మొత్తం 77 ఆస్తులను జప్తు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో గాలి జనార్దన్ రెడ్డి ఆ ఆస్తులపై హక్కును కోల్పోతారు.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications