ప్రియురాలి భర్తను ఇరికించి: టెక్కీ బెదిరింపు వెనుక!

ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ తన భార్యను చంపాడు! మరో కేసులో ప్రియురాలి భర్తను ఇరికించాలనుకున్నాడు. ఆ టెక్కీని పోలీసులు అరెస్టు చేశారు. గోకుల్ అనే సాఫ్టువేర్ ఇంజినీర్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమెకు అప్పటికే పెళ్లయింది.

దాంతో ఆమె భర్తను అడ్డు తొలగించుకోవడానికి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నకిలీ బాంబు బెదిరింపు కాల్ చేశాడు.

అందుకోసం పథకం వేశాడు. తొలుత తన ప్రియురాలి భర్త పాస్ పోర్టును దొంగిలించాడు. దానిని ఆధారంగా చూపించి అతడి పేరు మీద సిమ్ కార్డును కొనుగోలు చేశాడు. అలాగే ఫేస్‌బుక్‌లో అతడి పేరుమీద ఓ పేజీని క్రియేట్ చేశాడు. అందులో అతడిని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడిగా చూపించాడు.

Bengaluru Techie, Arrested for Hoax Calls, Says He Killed Wife: Police

సైబర్ క్రైం పోలీసులకు అది చిక్కాలని చూశాడు. కానీ అలా జరగలేదు. దీంతో, బెంగళూరు విమానాశ్రయానికి ఫోన్ చేశాడు. కాని అక్కడ ఎవరూ ఫోన్ ఆన్సర్ చేయకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయానికి కూడా అలాంటి బెదిరింపులే వాట్సప్ సందేశం ద్వారా పంపించాడు.

పోలీసులు కూడా తొలుత సిమ్ కార్డు వివరాల ఆధారంగా ప్రియురాలి భర్తనే అనుమానించారు. కానీ ఆ తర్వాత విషయం తెలిసి గోకుల్‌ను అరెస్టు చేశారు. ఇందులో ఉగ్రవాదం కోణం లేదని, నిందితుడి భార్య అనురాధ కొన్ని నెలల క్రితం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో ఆ కేసును ఇప్పుడు దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. తన భార్య పైన దాడి చేయడంతో చనిపోయినట్లు అతను అంగీకరించాడు.

తాను తన ప్రియురాలిని (ప్రియురాలి భర్త స్నేహితుడే) పెళ్లి చేసుకోవాలని భావించానని పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది. గోకుల్ సొంతూరు కేరళలోని త్రిషూర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+