'టెంపుల్ ముందు విడిచిన నా షూస్ పోయాయి'.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పోలీసులకు విచిత్ర ఫిర్యాదు చేశాడు. ఆలయం ముందు విడిచిన నా షూస్ పోయాయంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ షూస్ విలువ రూ. 16 వేలు అని తెలిపాడు. 5 నిమిషాల్లో గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చేలోపే షూస్ పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌత్ బెంగళూరులోని బనషెంకారి 2 స్టేజీలోని శ్రీ గణేష్ ఆలయం వద్ద జరిగినట్లు తెలుస్తోంది.
సౌత్ బెంగళూరులోని బనషెంకారి 2 స్టేజీలోని శ్రీ గణేష్ ఆలయానికి ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఎప్పటిమాదిరిగానే వెళ్లాడు. కానీ ఆలయం బయట విడిచిన అతడి రూ. 16వేల షూస్ 5 నిమిషాల్లో చోరీ చేశారు. దీంతో అతడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవంబర్ 6వ తేదీ సాయంత్రం 7 గంటల 20 నిమిషాల నుంచి 7 గంటల 25 నిమిషాల మధ్యలో ఇది జరిగినట్లు స్పష్టం చేశాడు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం అవుతోంది.
అయితే ఈ ఘటనపై ఆలయ పరిసరాల్లో సీసీటీవీని పరిశీలించిన పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. అలాగే అతడిపై తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షూస్ పోయాయని తొలుత ఆలయ మేనేజ్ మెంట్ కు చెబితే.. వాళ్లు.. ఇలాంటివి సాధారణం అని చెప్పారని టెకీ తెలిపాడు. ఇప్పటివరకూ ఆలయానికి వచ్చిన చాలామంది చెప్పులు మిస్ అయ్యాయని కానీ ఎవరూ పోలీసులుకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు ఆలయ సిబ్బంది. అయితే తాను మాత్రం ఈ ఘటనను ఊరికే వదిలేదని లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

సీసీటీవీ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకున్నారు. విచారణలో ఈ దొంగలు ఆ చెప్పులను రూ. 20 రూ. 50 కు అమ్మేసి మద్యం తాగుతారని తేలింది. అయితే ఆ టెకీ ఉద్యోగి మాత్రం.. ఇప్పుడు చిన్న క్రైమ్స్ చేశారు.. రేపు పెద్ద పెద్ద నేరాలు చేస్తారని.. వీళ్లకు తగిన బుద్ధి చెప్పాలని సూచించాడు. అయితే ఈ ఘటనపై బీఎన్ఎస్ సెక్షన్ 303 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications