Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీనామాలు చేస్తామని సీఎంకు హెచ్చరించిన మంత్రులు, రెడ్డితో పెట్టుకుంటే అంతే !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి అని మొదటి నుంచి నానా తంటాలు పడిన కాంగ్రెస్ పార్టీ చివరికి డీకే శివకుమార్ ను బుజ్జగించి ముఖ్యమంత్రి ఖుర్చీలో సిద్దరామయ్యను కుర్చో బెట్టారు. సీఎం పంచాయితీ తేలిపోయిందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంచెం ఊపిరి పీల్చకున్న సమయంలోనే మరో పంచాయితీ తెరమీదకు వచ్చింది.

సీఎం సీటులో సిద్దరామయ్యను, ఉప ముఖ్యమంత్రి పదవిలో డీకే శివకుమార్ ను కుర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు తరువాత మంత్రి పదవుల పంపకాల విషయంలో తలనొప్పి ఎదురైయ్యింది. మొదట మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తున్నామో వారి లిస్టు బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తరువాత అందరితో ప్రమాణస్వీకారం చేయించింది.

Bengaluru: Two senior ministers who called CM Siddaramaiah and warned that they will resign.

మంత్రులు అందరూ ప్రమాణస్వీకారం చేసిన తరువాత వారికి శాఖలు కేటాయించే విషయంలో మళ్లీ రామాయణం మొదలైయ్యింది. ఏదోఒక రకంగా మంత్రి పదవులు అందరికి కేటాయించారు. అయితే మంత్రి పదవుల కేటాయింపులో సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్యలో జరిగిన వర్గపోరుతో మంత్రి పదవులు కేటాయించే విషయంలో గందరగోళం నెలకొనింది.

ఇదే సమయంలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. మేము ఏమైనా భిక్షం అడుగుతున్నామా ?, మీరే మాకు ఇచ్చే మర్యాద ఇదేనా ? అంటూ మండిపడుతున్న ఇద్దరు సీనియర్ నాయకులు వారి మంత్రి పదవులకు రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారని వెలుగు చూడటం ఇప్పుడు కర్ణాటకలో చాలా హాట్ టాపిక్ అయ్యింది.

బెంగళూరు నగరంలోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డికి రవాణ శాఖ కేటాయించారు. గతంలో కూడా రామలింగా రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మహిళలు ఆర్ టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే నినాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు నష్టాల్లోకి వెలుతున్న రవాణా శాఖను తనకు అప్పగించడంతో రామలింగా రెడ్డి మండిపడుతున్నారని తెలిసింది. తాను ఇప్పటికే 7 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయ్యాను, ఇంత సీనియర్ అయిన తనకు రవాణా శాఖ అప్పగించారని, మీ శాఖలు మీ దగ్గరే పెట్టుకుని మీరే చూసుకోండి, తాను మంత్రి పదవికి రాజీనా చేస్తానని ఇప్పటికే సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేసి రామలింగా రెడ్డి చెప్పారని కన్నడ మీడియా అంటోంది.

Bengaluru: Two senior ministers who called CM Siddaramaiah and warned that they will resign.

రామలింగా రెడ్డి బాటలోనే మరో సీనియర్ నాయకుడు, గతంలో హోమ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన డాక్టర్ జీ. పరమేశ్వర్ కూడా వెలుతున్నారు. ఇంటలిజెన్స్ విభాగం ఇవ్వకుండా కేవలం హోమ్ శాఖా మంత్రిగా డాక్టర్ జీ. పరమేశ్వర్ ను నియమించడం ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది.

తనకు హోమ్ శాఖ పూర్తిగా కేటాయించలేదని, కేవలం హోమ్ శాఖా మంత్రిగా నియమించి తన పరువు తీశారని పరమేశ్వర్ మండిపడుతున్నారని తెలిసింది. ఇస్తే పూర్తిగా హోమ్ శాఖ ఇవ్వాలని, అందులో కోతలు కొయ్యడం సరికాదని పరమేశ్వర్ మండిపడుతున్నారని తెలిసింది. మంత్రులు రామలిగా రెడ్డి, డాక్టర్ జీ. పరమేశ్వర్ వారి పదవులకు రాజీనామా చేస్తామని ఇప్పటికే సీఎం సిద్దరామయ్యకు ఫోన్ చేసి చెప్పారని కన్నడ మీడియా అంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+