బెంగళూరు క్యాబ్ డ్రైవర్ అలా చేయడంతో షాక్ అయ్యా.. మహిళ షాకింగ్ వీడియో..

ప్రస్తుతం చాలామంది ప్రైవేట్ ట్రావెల్ సంస్థలపై ఆధారపడుతున్నారు. ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్, కారు ట్యాక్సీలు ఊపందుకున్నాయి. మెట్రో పాలిటన్ నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు వీటిని తరచుగా వాడుతుంటారు. వేగంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ఆకలితో ఉన్న తన కస్టమర్ ఆకలి తీర్చి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహిళా ప్రయాణికురాలు పోస్టు చేసింది.

Bengaluru Uber Driver Buys Sandwich for Hungry Passenger Heartwarming Post Goes Viral

ఆకలితో ఉన్న మహిళా ప్రయాణికురాలి ఆకలి తీర్చి అందరి ప్రశంసలు పొందుతున్నాడు ఆ ఉబర్ క్యాబ్ డ్రైవర్. ఈ విషయాన్ని అతని క్యాబ్ లో జర్నీ చేసిన కంటెంట్ క్రియేటర్ యోగితా రాథోడ్ పోస్టు చేశారు. ఇది తనకు మరచిపోని అనుభూతి అని పేర్కొంది. ఇలాంటి ఘటన తనకు ఎప్పుడూ జరగలేదని స్పష్టం చేసింది. క్యాబ్ లో ఎయిర్ పోర్ట్ కు వెళ్తున్న యోగితా.. అందులోనే ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.." నేను ఎయిర్ పోర్ట్ కు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నాను. జర్నీలో నా ఫ్రెండ్ తో ఫోన్ లో.. ఈ రోజు ఎంత బిజీగా జరిగిందో చెబుతున్నాను. నాకు కనీసం తినడానికి కూడా సమయం దొరకలేదని చెప్పాను. నా ఫ్లైట్ అర్ధరాత్రి 2 గంటలకు ఉంది. బెంగళూరు ఎయిర్ పోర్టు ఇంకా చాలా దూరం ఉంది.. అని చెప్పుకొచ్చాను. తినడానికి సమయం ఎప్పుడు దొరుకుతుందో తెలియడం లేదు అని చెప్పాను. ఈ క్రమంలో క్యాబ్ డ్రైవర్ సడెన్ గా కారు ఆపేశాడు. కొన్ని నిమిషాలు వెయిట్ చేయమని చెప్పి బయటకు వెళ్లాడు. నేను.. అతడు వాష్ రూమ్ కు వెళ్లాడేమో అనుకున్నా..

కానీ కొన్ని నిమిషాల తర్వాత జరిగిన విషయం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాను. నేను ఫోన్ లో మాట్లాడింది మొత్తం క్యాబ్ డ్రైవర్ విన్నాడు. అది విని నా కోసం షాపులో శాండ్ విచ్ కొనుగోలు చేసి తీసుకొచ్చాడు.. అని యోగితా వీడియోలో పేర్కొంది. దాంతో తాను ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. దానికి ఆ క్యాబ్ డ్రైవర్ బదులిస్తూ.. "మీరు ఆకలితో ఉన్నట్లు ఫోన్ లో మాట్లాడింది విన్నాను. నాకు బాధగా అనిపించింది. ఇక్కడ నా చెల్లి ఉన్నా నేను అలాగే ఆలోచించేవాడిని. అందుకే క్యాబ్ దిగి శ్యాండ్ విచ్ తీసుకొచ్చా" అని తెలిపినట్లు యోగితా తన ఇన్ స్టా వీడియోలో పోస్టు చేసింది. ఇలాగే అందరూ దయా హృదయాన్ని పంచాలని కోరుకుంటున్నట్లు వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+