కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా యుటి ఖాదర్, చేతులు ఎత్తేసిన సీనియర్లు, మంత్రి పదవి !
బెంగళూరు/మంగళూరు: కర్ణాటక అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యుటి. ఖాదర్ ఎన్నిక అవుతున్నారు. మంత్రి పదవి అశించిన యుటి ఖాదర్ కు మొదటి విడతలొనే మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. బెంగళూరు చామరాజ్ పేట్ ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ కు చెక్ పెట్టి యుటి. ఖాదర్ కు మంత్రి పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొదటి విడతలో 8 మంత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లిస్ట్ లో బెంగళూరు ఎమ్మెల్యే జమీర్ అహమ్మద్ ఖాన్ ఉండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్న యుటి. ఖాదర్ కర్ణాటక అసెంబ్లీలో స్పీకర్ అవుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో యుటి. ఖాదర్ మంగళూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు.

మంగళవారం మద్యాహ్నం 11 గంటలకు యుటి. ఖాదర్ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి నామినేషన్ సమర్పిస్తున్నారు. యుటి. ఖాదర్ ను స్పీకర్ చెయ్యడానికి నామినేషన్ పత్రాల్లో ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించే పనిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బిజీగా ఉన్నారు.
కర్ణాటక స్పీకర్ పదవి కోసం మొదట కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు ఆర్.వీ. దేశ్ పాండ్, టీబి, జయచంద్ర, హెచ్ కే. పాటిల్ పేర్లు తెర మీదరు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాల స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలని అని అనేక మంది నాయకులతో చర్చలు జరిపారు.
మీరు స్పీకర్ గా పని చెయ్యాలని మొదట ఆర్ వీ. దేశ్ పాండ్ కు మనవి చేశారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, స్పీకర్ గా పని చెయ్యలేనని, తనకు మంత్రి పదవి కావాలని ఆర్ వీ. దేశ్ పాండ్ హైకమాండ్ కు చెప్పారు. తరువాత మాజీ మంత్రి హెచ్.కే పాటిల్, సీఎం సిద్దరామయ్యకు చాలా సన్నిహితుడు అయిన అళంద ఎమ్మెల్యే బిఆర్. పాటిల్ ను సంప్రధించినా ఆయన కూడా స్పీకర్ పదవిలో ఉండటానికి నిరాకరించారని తెలిసింది.

చివరికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అన్ని ఆలోచించి మంగళూరు ఎమ్మెల్యే, మంత్రి పదవి ఆశిస్తున్న యుటి. ఖాదర్ ను కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారని తెలిసింది. డీకే శివకుమార్ సీఎం అయ్యే సమయంలో యుటి. ఖాదర్ కు మంత్రి పదవి ఇష్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని తెలిసింది.
గతంలో కర్ణాటక శాసనసభలో డిప్యూటీ అపోజీషన్ లీడర్ గా యుటి. ఖాదర్ పని చేసిన అనుభవం ఉంది. ముస్లీంలకు స్పీకర్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రయత్నించిందని సమాచారం. మొత్తం మీద మంత్రి పదవి వస్తుందని ఆశపడిన యుటి. ఖాదర్ కు స్పీకర్ పదవి రావడంతో ఆయన ఇష్టం లేకుండానే ఈ రోజు నామినేషన్ వేస్తున్నారని తెలిసింది.
-
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు కాదు.. ఒక్క నామినేషన్‌కు మూడు పార్టీలు! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
అడ్డంగా దొరికిన చంద్రబాబు? అంకెలతో తేల్చేసిన సజ్జల ..! -
బంగారం ధరల్లో లాభాల మోత -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం










Click it and Unblock the Notifications