సెంట్రల్ జైల్లో భర్త, వైజాగ్ వ్యాపారులతో భార్య డీల్, ఐటీ హబ్ లో, రూ. లక్షలో !
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మంచి ఏరియా సమీపంలో నివాసం ఉంటున్న దంపతులు డబ్బులు బాగానే సంపాధిస్తున్నాడు. అయితే భర్త చేస్తున్న వ్యాపారం గురించి తెలిసినా అతని భార్య ఏమాత్రం మాట్లాడలేదు. ఇటీవల భర్తను అరెస్టు చేసి జైలుకు పంపించారు. భర్త జైలుకు వెళ్లిన తరువాత భార్య వైజగ్ వ్యాపారులతో డీల్ పెట్టుకుని ఆ వ్యాపారం మొదలుపెట్టి పోలీసులకు అడ్డంగా చిక్కిపోయింది.
బెంగళూరులో నగ్మా అనే మహిళను అరెస్టు చేసి ఆమె నుంచి రూ. 13 లక్షల విలువైన 26 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో నివాసం ఉంటున్న నగ్మా (27)ను కళాసిపాళ్య పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో గంజాయి అమ్మిన కేసులో నగ్మా భర్తను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. భర్త ముజ్జును జేజే నగర్ పోలీసులు అరెస్ట్ చెయ్యడంతో నగ్మా ఏమాత్రం ఫీల్ కాలేదు.

భర్త ముజ్జు జైలుకు వెళ్లిన తరువాత అతని భార్య నగ్మా ఇదే గంజాయి వ్యాపారాన్ని కొనసాగించింది. అంతే కాదు ఈ మహిళ తన ముగ్గురు పిల్లలను ఈ వ్యాపారం కోసం ఉపయోగించుకుంది.
రెండు, మూడు, ఏడు సంవత్సరాల వయస్సు గల ఆమె ముగ్గురు పిల్లలు గంజాయి తీసుకురావడానికి నగ్మా ఉపయోగించుకోవడంతో పోలీసులు షాక్ అయ్యారు. తన పిల్లలతో కలిసి మూడు గంజాయి బస్తాలను తీసుకుని వెలుతున్న సమయంలో నగ్మా కళాసిపాళ్య పోలీసులకు చిక్కిపోయింది.

రూ. 13 కిలోల గంజాయితో పాటు నగ్మాను కళాసిపాళ్య పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ పరప్ప అగ్రహార సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. గత నెల వరకు మజ్జు విశాఖపట్నం (వైజాగ్) నుంచి గంజాయి తీసుకొచ్చి బెంగళూరులో విక్రయించాడు. ముజ్జు జైలుకు వెళ్లిన తరువాత అతని భార్య నగ్మా కూడా విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి బెంగళూరులో విక్రయిస్తోందని బెంగళూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications