జయలలిత, అమృత, మిస్టరీ: శశికళకు మొత్తం తెలుసు: ఆరుద్ర భార్య, గీత

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన అమృత (37) ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అసలు అమృత జయలలిత కుమార్తెనా, కాదా, అంత ధైర్యంగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించింది అంటూ ఇప్పుడు తమిళనాడుతో సహ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అమృత చెబుతున్న విషయాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

 మైలాపూర్ ఇంటిలో పుట్టాను!

మైలాపూర్ ఇంటిలో పుట్టాను!

జయలలిత సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో 1980 ఆగస్టు 14వ తేదీ చెన్నై నగరం సమీపంలోని మైలాపుర్ లోని జయ ఇంటిలోనే తాను జన్మించానని అమృత అంటున్నారు. ఈ విషయం జయలలిత బంధువులు కొందరికి తెలుసని అమృత వాదిస్తున్నారు.

సినిమా కేరీర్ కోసం రహస్యంగా?

సినిమా కేరీర్ కోసం రహస్యంగా?

జయలలిత సినిమా కెరీర్‌ పాడవకుండా ఆమెకు బిడ్డపుట్టిన విషయాన్ని బయటకు రానీయకుండా ఆమె కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అమృత అంటోంది. బెంగళూరుకు చెందిన జయలలిత సోదరి శైలజ, సారథి దంపతులకు తనను అప్పగించారని అమృత చెబుతోంది.

చనిపోయే ముందు చెప్పారు!

చనిపోయే ముందు చెప్పారు!

ఈ ఏడాది మార్చిలో తన పెంపుడు తండ్రి సారథి కన్నుమూశారని, ఆయన చనిపోయే సమయంలో తనను పిలిచి నువ్వు మా సొంత కుమార్తె కాదని, జయలలిత కుమార్తె అని చెప్పారని అమృత అంటోంది. జయలలిత బంధువు లలిత కూడా ఈ విషయాన్ని నిర్ధారించారని అమృత చెప్పింది.

మొదటి సారి పోయెస్ గార్డెన్ లో!

మొదటి సారి పోయెస్ గార్డెన్ లో!

1996 జూన్ 6వ తేదీన పోయెస్ గార్డెన్ లోని జయలలిత ఇంటికి తాను మొదటి సారి వెళ్లి కలిశానని అమృత అన్నారు. ఆ సందర్బంలో తనను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుందని, ఓకే కంచంలో ఇద్దరూ భోజనం చేశామని అమృత వివరించింది.

ఎవరు ఈ గీత?

ఎవరు ఈ గీత?

అమృత చెబుతున్న విషయాలను జయలలిత చిన్ననాటి స్నేహితురాలు గీత సమర్థించారు. జయలలిత, శోభన్ బాబులకు ఓ కుమార్తె పుట్టిందని గీత అంటున్నారు. జయలలితకు కుమార్తె ఉన్న విషయం శశికళ నటరాజన్ తో సహ ఆమె సన్నిహితులందరికీ తెలుసని గీతా చెబుతున్నారు.

 ఆరుద్ర భార్య

ఆరుద్ర భార్య

జయలలితకు ఓ కుమార్తె ఉందని ప్రముఖ కవి ఆరుద్ర భార్య రామలక్ష్మి దృవీకరించారు. జయలలిత, శోభన్ బాబుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవని రామలక్ష్మి చెబుతున్నారు. జయలలితకు ప్రముఖ కవి ఆరుద్ర కుటుంభానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

భార్య కోసం

భార్య కోసం

అప్పటికే వివాహం అయిన శోభన్ బాబు తన భార్యకు ద్రోహం చెయ్యకూడదని నిర్ణయించడం వలనే జయలలితను ఆయన పెళ్లి చేసుకోలేకపోయారని రామలక్ష్మి చెబుతున్నారు. మొత్తం మీద అమృతకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తేనే ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చిక్కుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amrutha says Jayalalithaa gave her away to Shylaja as she was scared of the social stigma attached to being an unmarried woman with a kid and claims that she had met Jayalalithaa at her Poes Garden residence on a few occasions and once spent a month there.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X