వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భబానీపూర్ ప్రచారంలో ఘర్షణ .. టీఎంసీ వర్సెస్ బీజేపీ; తుపాకులతో బెదిరించిన దిలీప్ ఘోష్ సెక్యూరిటీ

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. పశ్చిమ బెంగాల్ లో సెప్టెంబర్ 30న మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ ను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో ఆమెను ఓడించటానికి బీజేపీ నేతలు సర్వ శక్తులను ఒడ్డుతున్నారు. భబానిపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో ప్రచార పర్వం పీక్స్ కు చేరుకుంది . మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం పూర్తికానున్న నేపథ్యంలో అధికార టీఎంసీ ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో రగడ కొనసాగుతుంది.

టీఎంసి కార్యకర్తలపై బీజేపీ ధ్వజం .. టీఎంసీ గుండాలు దాడి చేశారని ఆరోపణ
భబానిపూర్ లో బీజెపి పార్టీ నాయకుడు దిలీప్ ఘోష్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఎన్నికల ప్రచారంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఎంసి గుండాలు రంగంలోకి దిగారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. భబానిపూర్ నియోజకవర్గంలో బిజెపి విస్తృతమైన ప్రచారాన్ని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సువేందు అధికారితో ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరిగి ఎన్నిక కావాలని , భబానీ పూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగారు.

Bhabanipur campaign : TMC vs BJP; Dilip Ghosh security shows guns on TMC protesters

దిలీప్ ఘోష్ ను ముట్టడించిన టీఎంసి కార్యకర్తలు.. దాడి చేశారన్న దిలీప్ ఘోష్
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ నేతృత్వంలోని బిజెపి నాయకులు భబానీపూర్‌లో ప్రచారం చేస్తుండగా, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన తెలియజేశారు. టీఎంసి కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు బాహాబాహీ చోటుచేసుకోగా, ఈ ఘర్షణలో దిలీప్ ఘోష్ టిఎమ్‌సి కార్యకర్తలు తనపై దాడి చేశారని ఆరోపించారు. బిజెపి యొక్క భబానీపూర్ ప్రచారంలో బయటపడిన వీడియోలు, దిలీప్ ఘోష్ చుట్టూ ఆందోళనకారులు నినాదాలు చేస్తూ, అతని భద్రతా సిబ్బంది అతనిని కాపాడటానికి పోరాడుతున్నట్టు కనిపిస్తున్నాయి.

దిలీప్ ఘోష్ సెక్యూరిటీ తుపాకులను బయటకు తీసి బెదిరింపు, దాడి చెయ్యలేదన్న టీఎంసీ
దిలీప్ ఘోష్‌ను కాపాడుతూ అతని భద్రతా సిబ్బంది తమ తుపాకులను బయటకు తీసి ఆందోళనకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న జనాన్ని చెదరగొట్టడానికి వారు తుపాకులను గాలిలో చూపారని చెప్తున్నారు . దిలీప్ ఘోష్, టిఎమ్‌సి కార్మికులు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. మరో బిజెపి నాయకుడు అర్జున్ సింగ్ కూడా టీఎంసీ మద్దతుదారులు తమపై దాడి చేశారని ఆరోపించారు. మరోవైపు, టిఎంసి నాయకుడు మదన్ మిత్రా తాము ఎలాంటి దాడి చేయలేదని, కేవలం నిరసన మాత్రమే తెలియజేశామని పేర్కొన్నారు. దిలీప్ ఘోష్ మరియు ఇతర నాయకులు భబానీపూర్ ఓటర్ల నివాసాల్లోకి ప్రవేశించి, వారిని బెదిరిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు. అందుకే నిరసన తెలియజేశామని చెప్పారు.

భబానీపూర్ నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారం
ఇదిలా ఉంటే భబానీపూర్ నియోజకవర్గాన్ని గెలవడం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బిజెపి నాయకులు సువేందు అధికారి, అగ్నిమిత్రా పాల్, అర్జున్ సింగ్ మరియు అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భబానీపూర్ లోనే టిఎంసి కార్యాలయం సమీపంలో మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేసిన ప్రియాంకా టిబ్రేవాల్ కోసం బిజెపి నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో దీదీ గెలుపు పక్కా అని భావిస్తుంటే ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయాన్ని ఆపాలని బీజేపీ నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

English summary
The clash took place during the Bhabanipur constituency campaign. TMC activists protest against BJP leader Dilip Ghosh campaigning, Dilip Ghosh security pull out their guns and shows guns to TMC workers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X