వసుంధర రాజెకు తీవ్ర నిరాశ: చివరి వరకూ ఊరించి: రాజస్థాన్‌కు కొత్త సీఎంగా
Rajasthan CM: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తొమ్మిది రోజులకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై నెలకొన్న సస్పెన్స్‌కు తెర పడింది. కొత్త ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకుంది.
ఆయనే- భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma). ఈ మేరకు జైపూర్‌లో జరిగిన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఆయన పేరును ఖరారు చేసింది బీజేపీ టాప్ క్యాడర్. ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు భజన్ లాల్ శర్మ. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్రజీ భరద్వాజ్‌ను ఓడించారు.

కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, సరోజ్ పాండేతో కూడిన బీజేపీ కేంద్ర పరిశీలకుల సమక్షంలో భజన్‌లాల్ శర్మ పేరును ఖరారు చేశారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు ముఖ్యమంత్రి అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్‌కు మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రులుగా ప్రకటించింది.
ఇక తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రిని తేల్చేసింది. దీనితో మూడు రాష్ట్రాలకూ ముఖ్యమంత్రులను ఎంపిక చేసినట్టయింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మాజీ ముఖ్యమంత్రి, సీఎం రేసులో ఉన్న వసుంధర రాజెకు తీవ్ర నిరాశకు గురిచేసినట్టయింది. చివరి వరకూ ఆమె పేరు వినిపించింది.
వసుంధర రాజెకు ప్రత్యామ్నాయం ఎవరూ లేరనుకున్న దశలో అనూహ్యంగా భజన్‌లాల్ శర్మ పేరును తెరమీదికి తీసుకొచ్చింది బీజేపీ అధిష్ఠానం. చివరి నిమిషంలో ఆమె పేరును జాబితా నుంచి తప్పించింది. దీనికి ప్రతిగా వసుంధర రాజె సేవలను కేంద్రంలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications