రేపు భారత్ బంద్, మమత ఆగ్రహం: తెరిచేవి, మూతబడేవి..
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2వ తేదీన ట్రేడ్ యూనియన్స్ భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం పెంచిన కనీస వేతనాన్ని, ఇతరాలను ట్రేడ్ యూనియన్స్ వ్యతిరేకించాయి. కేంద్రం తమ డిమాండ్లేమీ నెరవేర్చలేదంటూ ట్రేడ్ యూనియన్స్ బంద్ చేయాలనే నిర్ణయించాయి.
ట్రేడ్ యూనియన్ డిమాండ్ మేరకు ప్రస్తుతం ఉన్న కనీస వేతనంను రూ.350కి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండేళ్ల పెండింగ్ బోనస్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే కార్మికుల మేజర్ డిమాండ్లేమీ ప్రభుత్వం పరిష్కరించలేదని, బంద్ వెనక్కి తీసుకునేది లేదని సీఐటీయూ వెల్లడించింది.
మమతా బెనర్జీ ఆగ్రహం
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సిఐటియు నిర్వహించతలపెట్టిన బంద్ పట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ట్విట్టర్ ద్వారా ఈ అంశంపై స్పందించారు. జనజీవనానికి అంతరాయం కలిగిస్తే ఊరుకోబోమన్నారు.
రేపు తమ రాష్ట్రం స్తంభించదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు, కార్యాలయాలు, కర్మాగారాలు రేపు తెరుచుకునే ఉంటాయన్నారు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ సేవలు కూడా ప్రజలకి అందుతాయన్నారు. ఎవరైనా అడ్డుతగిలితే తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రేపటి బంద్‌లో తమ రాష్ట్రంలో వాహనాలు, దుకాణాలు ధ్వంసమైతే వాటికి తాము పరిహారం ఇవ్వనున్నట్లు చెప్పారు.

ఏవి మూతబడతాయి?
- 15 కోట్ల మంది కార్మికులు భారత్ బంద్‌లో పాల్గొంటారు. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు సెక్టార్ కార్మికులు ఉన్నారు. బ్యాంకులు, ఇన్సురెన్స్ కంపెనీల కార్మికులు బందులో పాల్గొంటారు.
- ఎలక్ట్రిసిటీ, ట్రాన్సుపోర్ట్, మైనింగ్, డిఫెన్స్, టెలికాం, ఇన్సురెన్స్ వంటి సర్వీస్ సెక్టార్ల పైన ప్రభావం పడుతుంది.
- బ్యాంకులు, గవర్నమెంటు కార్యాలయాలు, ఫ్యాక్టరీలలో ఎక్కువ వరకు మూసివేసి ఉంటాయి.
- పబ్లిక్ ట్రాన్సుపోర్ట్ సర్వీసు పైన ప్రభావం పడనుంది. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి పలుచోట్ల ఆటా రిక్షా యూనియన్లు బందులో పాల్గొంటున్నాయి.
ఏం తెరిచి ఉంటాయి?
- రైల్వే కార్మికులు అందరూ భారత్ బందులో పాల్గొంటారా లేదా తెలియాల్సి ఉంది.
- పాఠశాలలు, కళాశాలలో అధికారికంగా సెలవు దినంగా ప్రకటించలేదు. స్థానికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఏ యూనియన్లు భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయి?
- లెఫ్ట్ ట్రేడ్ యూనియన్లు ఐఎన్చటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయు, ఏఐటీయూసి, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, యూటీయూఎస్, ఎల్పీఎఫ్‌లు పాల్గొంటున్నాయి.
- భారతీయ మజ్దూర్ సంగ్ (బీఎంఎస్) భారత్ బంద్‌లో పాల్గొనడం లేదు.
డిమాండ్ ఏమిటి?
- కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. కార్మిక చట్టాలను మార్చాలని డిమాండ్ చేస్తున్నరు.
- అసంఘటిత సంస్థలలో కనీస వేతనం రూ.18,000గా ఉండాలి.
- కాగా, ప్రభుత్వం ఇప్పటికే పలు డిమాండ్లు నెరవేర్చింది. కానీ కార్మిక సంఘాలు తగ్గడం లేదు. మొత్తం హామీలు నెరవేర్చడం లేదంటున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications