నేడు భారత్ బంద్: నిలిచిన రవాణా - విద్యా సంస్థలు, బ్యాంకులు..!!

భారత్ బంద్ కు పలు సంఘాలు నిర్ణయించాయి. ఈ రోజు (గురువారం) భారత్ బంద్ నిర్వహించాలని కార్మిక, రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రవాణా వ్యవస్థ నిలిచి పోనుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. లేబర్ యాక్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా బంద్ కు నిర్ణయం తీసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక - రైతు సంఘాలు ఈ బంద్ కు మద్దతు ప్రకటించాయి. బ్యాంకుల పైన ప్రభావం పడింది. బ్యాంకులతో పాటుగా ఇన్స్యూరెన్స్ సేవల పైనా ప్రభావం పడింది. విద్యా సంస్థల పైనా బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఈ రోజు భారత్‌ బంద్‌ నిర్వహించాలని రైతు సంఘం సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపునిచ్చింది. ఆ సంఘం కన్వీనర్‌ హన్నన్‌ మొల్లా మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాల వాణిజ్య ఒప్పందం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది భారత రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అమెరికా నేర్పరితనానికి భారత ప్రభుత్వం లొంగిపోయిందని ఆయన ఆరోపించారు.

Bharat bandh Several farmer organizations Trade unions have announced a Bharat Bandh on February 12

ఈ నెల 12న జరగను న్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలుగు రాష్ట్రాల్లోని వామపక పార్టీల నేతలు పిలుపునిచ్చాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుందని, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు 3 లేబర్కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ - చట్టం- 2025, వీబీజి రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐసీలో 100శాతం విదేశీ పెట్టు బడులకు అనుమతించడం వంటి ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్ కు పిలుపునిచ్చాయి.

నిలిచిపోతున్న రవాణా వ్యవస్థ

తెలుగు రాష్ట్రాల్లో వామపక్ష పార్టీలు.. కార్మిక, విద్యార్థి అనుబంధం సంఘాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్‌ మోటార్‌ డ్రైవర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ వెంకటేశం ఆరోపించారు. కార్మికుల నడ్డివిరిచే దుర్మార్గమైన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు నిర్వహిస్తున్న జాతీయ సార్వత్రిక సమ్మెలో రవాణా రంగ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బ్యాంకు ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. దీంతో, బ్యాంకింగ్ సేవల పైనా ప్రభావం పడింది. ఇక.. పరీక్షల సమయం కావటంతో విద్యా సంస్థల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+