కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఏడాదికి 700 మిలియన్ డోసులు
కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ కొరత ఉంటుంది. కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు భారత్ బయోటెక్ మంగళవారం ప్రకటించింది.
ఏడాదికి 700 మిలియన్ల డోసుల కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా సామర్థ్యాన్ని విస్తరించినట్లు తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్‌లలోని ప్లాంట్లలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లు వివరించింది. భారత్ బయోటెక్‌కు గత వారం కేంద్ర ప్రభుత్వం రూ.65 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సోమవారం సీరం ఇన్‌స్టిట్యూట్‌కు రూ.3,000 కోట్లు; భారత్ బయోటెక్‌కు రూ.1,500 కోట్లు అడ్వాన్స్‌ను ఆమోదించింది.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను రెండు, మూడు నెలల్లో సరఫరా చేయడం కోసం అడ్వాన్స్‌గా ఈ నిధులనుసమకూర్చింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ నెలకు 4 మిలియన్ల కోవాగ్జిన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నెలకు 60 మిలియన్ డోసుల కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తోంది.
కరోనా కోసం వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే సీపీఆర్ టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బ్లడ్‌లో తేడా జరిగి ప్రాణానికే ప్రమాదం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇటీవల నటుడు వివేక్ అలానే చనిపోయిన సంగతి తెలిసిందే. దీంతో జనం మరింత ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications