ఈ రాశులవారికి అక్టోబర్ 15 వరకు సూర్య కటాక్షం ... సంపదలు ఖాయం
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా భావించే సూర్యుడి సంచారానికి విశేష ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం తన మిత్ర క్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్న రవి, అక్టోబర్ 15 వరకు తన స్నేహ, స్వక్షేత్రాల్లోనే సంచారం చేస్తారు. ఈ నాలుగు నెలల సుదీర్ఘ కాలంలో సూర్య సంచారం కారణంగా విశ్వంలో కొన్ని రాశుల వారికి ఊహించని రీతిలో రాజయోగాలు పట్టే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
సూర్య సంచారంతో లబ్దిని పొందే రాశులివే
ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు, గట్టి పట్టుదల, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్న వారికి సూర్య సంచారం గొప్ప సానుకూల పరిణామాలను తీసుకువస్తుంది. దీని ప్రభావం వల్ల మేషం, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి తిరుగులేని అధికార యోగం, ఉద్యోగ లాభాలు కలగనున్నాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మేషరాశి
మేష రాశి వారికి రాశ్యాధిపతి కుజుడితో సూర్యుడికి ఉన్న చెలిమి కారణంగా తక్కువ శ్రమతోనే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు లభిస్తాయి.
మిధున రాశి
మిథున రాశిలో రవి సంచారం వల్ల వీరు ఏ కొత్త పనులు తలపెట్టినా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఈ సమయం మిధున రాశి వారికి సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. మిధున రాశి జాతకులకు కలిసి వస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ నెల 15 నుండి జీవితంలో ఊహించని మలుపులు మొదలవుతాయి, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగి ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన సానుకూల ప్రయోజనాలు వస్తాయి.
సింహరాశి
సొంత రాశి అయిన సింహ రాశి వారిపై రవి ప్రభావం అత్యంత అద్భుతంగా ఉంటుంది, వీరికి రాజకీయ పరిచయాలు పెరగడమే కాకుండా పెద్ద సంస్థల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. సింహరాశి జాతకులకు సూర్య సంచారం కారణంగా సంపదల వర్షం కురుస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలిక కోర్టు సమస్యలు, అప్పుల బాధలు తీరిపోయి నూతన గృహ ప్రాప్తి కలుగుతుంది. ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఇప్పుడు బలోపేతం అవుతారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల త్వరలోనే నిజమవుతుంది, వారి పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది.సూర్యుడి మిత్ర స్వక్షేత్ర సంచార కాలం అక్టోబర్ 15 వరకు కొనసాగనుంది కాబట్టి, ధనుస్సు రాశి వారికి ఆశించిన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications