Bharat Gaurav: రైలులో కలకలం: ఏకంగా 40 మందికి వాంతులు, విరేచనాలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ గౌరవ్ యాత్ర ఎక్స్‌ప్రెస్.. వివాదాలకు కేంద్రబిందువుగా మారినట్టయింది. ఈ రైళ్ల నిర్వహణను ప్రైవేట్ ఆపరేటర్ల చేతికి అప్పగించడంపై మొదట్లోనే పలు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. రైల్వే మంత్రిత్వ శాఖ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడా విధానాలే విమర్శలకు కారణమౌతోన్నాయి.
భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన 40 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఆ రైలును నిలిపివేసి, అనారోగ్యానికి గురైన ప్రయాణికులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తోన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

చెన్నై నుంచి బయలుదేరిన భారత్ గౌరవ్ యాత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి భోజనం చేసిన తరువాత కొద్దిసేపటి తరువాత ప్రయాణికులు అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. 40 మంది ప్రయాణికులు అనారోగ్యానికి గురైనట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు.
రైలు పుణె స్టేషన్‌కు చేరుకున్న తరువాత వారందరినీ సస్సూన్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్‌కు గురైనట్లు డాక్టర్లు చెప్పారు. అక్కడ నాణ్యమైన చికిత్సను అందిస్తోన్నామని రైల్వే అధికారులు తెలిపారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వివరించారు. రాత్రి వారు తీసుకున్న ఆహారం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు నిర్ధారించారు. ఈ రైలును ఓ ప్రైవేట్ ఆపరేటర్ నడిపిస్తోన్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications