వాజ్‌పేయికి యూపీఏ భారతరత్న ఇస్తే..: అద్వానీ, చాట్ తినేందుకు..
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి భారతరత్న ఇచ్చి ఉంటే ఆ గౌరవం వారికి దక్కి ఉండేదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ గురువారం అన్నారు. 'హమారే అటల్ జీ' పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడారు.
యూపీఏ హయాంలో వాజపేయికి భారతరత్న ఇచ్చి ఉంటే వారికి ఆ గౌరవం దక్కేదన్నారు. వాజపేయికి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తాను యూపీఏ ప్రభుత్వానికి అప్పుడు లేఖ రాశానని, ఆ లేఖను మన్మోహన్ అందుకున్నట్లు తనకు సమాచారం వచ్చిందని, కానీ వారి నుండి స్పందన లేదన్నారు. భారతరత్న ఇస్తే కనుక మన్మోహన్‌కు గౌరవం దక్కేదన్నారు.

కాగా, అంతకుముందు అద్వానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను, వాజపేయి ఢిల్లీ వీధుల్లో యువకులుగా స్కూటర్ పైన సవారీ చేసేవాళ్లమని అన్నారు. ఛాట్ తినిపించేందుకు వాజపేయిని స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకొని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌కు తీసుకు వెళ్లేవాడనని అద్వానీ తెలిపారు. బీజేపీ ప్రస్తుత రూపం సంతరించుకోవడం వెనుక వీరిద్దరి కృషి అమోఘమైనదన్నారు.
భారతరత్న పురస్కారానికి తన పేరును సిఫారసు చేసుకోవాలంటూ పార్టీ నేతలు చేసిన ప్రతిపాదనను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజపేయి తిరస్కరించాలని సీనియర్ జర్నలిస్ట్ అశోక్ టాండన్ తెలిపారు. వాజపేయి హయాంలో ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా టాండన్ వ్యవహరించారు.
ఇప్పుడు వాజపేయికి భారతరత్న వచ్చిన విషయం తెలిసిందే. దీని పైన ఆయన స్పందించారు. కార్గిల్ యుద్ధం తర్వాత వాజపేయికి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని బీజేపీ నేతలు ఆకాంక్షించారు. 1998లో జరిపిన అణు పరీక్ష, తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం.. వీటన్నింటితో వాజపేయికి బాగా ప్రజాదరణ పెరిగిందని వారు అభిప్రాయపడేవారని చెప్పారు.
ఈ నేపథ్యంలో భారతరత్న పురస్కారానికి స్వయంగా పేరును ప్రతిపాదించుకోవాలని ఆయన పైన తరుచుగా ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు అధికారంలో ఉండగా ఇలాగే చేశారని చెప్పారు. కానీ వాజపేయి తిరస్కరించారని చెప్పారు.
-
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం












Click it and Unblock the Notifications