ఛీ.. ఛీ.. క్లాస్ రూమ్ లో విద్యార్థితో దొరికిపోయిన మహిళా టీచర్.. వీడియో వైరల్
తల్లిదండ్రుల తర్వాత గురువును ప్రత్యక్ష దైవంగా భావిస్తారు విద్యార్థులు. వారిని కన్న బిడ్డలుగా భావించి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులే ఇలా తప్పుడు పనులు చేస్తూ సభ్య సమాజానికి మచ్చగా మారుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన గురువే.. ఇలా క్లాస్ రూమ్ లో పాడు చేస్తున్నారు. అలాంటి ఓ సంఘటన అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ కుర్చీలో కూర్చుని ఓ స్టూడెంట్ తో మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
#WATCH | #Bhopal: Govt School Teacher Gets Foot Massage From Student; Video Goes Viral#MPNews #MadhyaPradesh pic.twitter.com/LJ4JaddI4P
— Free Press Madhya Pradesh (@FreePressMP) August 10, 2025
రాను రాను ఉపాధ్యాయుల ప్రవర్తన మితిమీరిపోతుంది. కొందరు స్టూడెంట్స్ తో డైరెక్ట్ గా ఎఫైర్స్ పెట్టుకున్న ఘటనలు మనం చూశాం. ఇటీవల ముంబైలో ఓ మహిళా టీచర్ విద్యార్థికి ఆన్ లైన్ లో శృంగార పాఠాలు చెప్పిన ఘటన విన్నాం. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్య ప్రదేశ్ లో ఓ టీచర్ కుర్చీలో కూర్చొని ఓ విద్యార్థితో కాళ్లకు మసాజ్ చేయించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మధ్యప్రదేశ్ భోపాల్ లోని గాంధీ నగర్ లోని మహాత్మా గాంధీ హైయర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి మహిళా టీచర్ పాదాలకు మసాజ్ చేశాడు. ఆమె కాళ్లు ఒత్తుతూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు సదరు టీచర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను కావాలని ఇలా చేయలేదని.. కాలుకు గాయమైతే విద్యార్థులే సాయం చేశారని తెలిపారు. పాదానికి నొప్పి తగ్గించడానికి ఒక విద్యార్థి ఆప్యాయతతో మసాజ్ చేశాడని వెల్లడించింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి ఆమోద్ సక్సేనా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఒక బృందాన్ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications