హర్యానా ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో అంతర్గత విబేధాలు..?

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. టికెట్ల కేటాయింపుల విషయంలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఈ అసమ్మతి ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా, పార్లమెంటు సభ్యురాలు , దళిత నాయకురాలు కుమారి సెల్జాలకు నెలకొంది. వీరి మధ్య విబేధాలు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని హస్తం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరు నాయకత్వం వహిస్తారనే దానిపై పార్టీలో అంతర్గత విబేధాలకు కారణమని తెలుస్తోంది.

అటు పార్టీలో నెలకొన్న అంతర్గత విబేధాలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. కీలకమైన ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థి ఎవరన్నదానిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థత్వంపై ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని స్పష్టం చేశారు. అటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత ఆశయాలపై కాకుండా, పార్టీ ఐక్యతను కాపాడుకోవడం వంటి సమిష్టి లక్ష్యాలపై దృష్టి పెట్టాలన్నారు. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు..

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గేతో పాటు భూపిందర్ సింగ్ హుడా నిలబడి పార్టీ శ్రేణుల్లో ఐక్యతను ప్రదర్శించారు. గతంలో పార్టీని ఇబ్బందులకు గురిచేసిన విభజన ఆపదలను నివారించేందుకు విస్తృత వ్యూహంలో ముందుకెళ్తున్నారు. అటు రాహుల్ గాంధీ ఆసంధ్‌లో పార్టీ ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సెల్జాకు విధేయుడైన అభ్యర్థి షంషేర్ సింగ్ గోగికి మద్దతు ఇస్తున్నారు. ఆదిత్య సూర్జేవాలాకు మద్దతుగా కైతాల్‌లో ఉన్నత స్థాయి సమావేశానికి రెడీ అయ్యారు.

మరోవైపు కుమారి సెల్జాలో మరింత నిరాశ ఎక్కువగా కన్పిస్తుంది. ముఖ్యంగా టిక్కెట్ పంపిణీలో హుడా శిబిరానికి ప్రాధాన్యతనిచ్చినట్లు తన అనుచరులతో అన్నట్లు సమాచారం. ముఖ్యంగా జాట్ కమ్యూనిటీలో హుడా ప్రభావంతో పాటు దళితుల ఓట్లను కూడగట్టుకోవాల్సిన కీలకమైన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ల పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.

కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో అనుసరించిన విధానానికి అద్దం పడుతూ సమష్టి నాయకత్వానికి ఖర్గే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం ద్వారా పార్టీలో అంతర్గత పోటీ నిరోధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పార్టీలో అంతర్గ విబేధాలు ఉన్నప్పటికీ, ఈ వ్యూహం పార్టీ ఐక్యతకు దోహదం చేస్తుందని భావనలో ఉంది.

రాబోయే ఎన్నికలకు సమ్మిళిత వ్యూహాన్ని నిర్ధారిస్తూ, తన నాయకుల ఆశయాలను సమతుల్యం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి చుట్టూ సందిగ్ధత కొనసాగించే ఈ వ్యూహం హర్యానాలో ఫలిస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతానికి, పార్టీ నాయకత్వం ఊహాగానాలకు స్వస్తిచెప్పేందుకు సుముఖంగా కనిపిస్తోంది. ఇది పార్టీలో అన్ని వర్గావారిని ఎన్నికలపై దృష్టి పెట్టి సమిష్టిగా విజయం సాధించడానికి దొహదం చేస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+