నాలుగేళ్ల కనిష్టం: భారీగా పడిపోయిన బీటెక్, ఎంటెక్ ఎన్రోల్మెంట్స్
బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గత కొద్ది సంవత్సరాలుగా భారీగా తగ్గిపోతోంది. హైయ్యర్ ఎడ్యుకేషన్(ఏఐఎస్హెచ్ఈ)పై ఆల్ ఇండియా సర్వే శనివారం విడుదలైంది. ఈ సర్వే ప్రకారం ప్రాఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య నాలుగేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది.
ఏఐఎస్హెచ్ఈ 2018-19 ప్రకారం. టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేసే విద్యార్థుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. 2014-15లో 2,89,311 ఉండగా 2018-19లో ఈ సంఖ్య 1,35,500కి పడిపోయింది. ఇదే కాలానికి బీటెక్ లో చేరే వారి సంఖ్య కూడా 11శాతం తగ్గిపోయింది. ఈ కాలానికి 42,54,919 నుంచి 37,70,949కు పడిపోయింది.
అయితే, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీఈడీ, ఎల్ఎల్ బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గుచూపుతూనే ఉన్నారు. 2014-15లో ఎంబీఏ చేసిన వారి సంఖ్య 4,09,432 ఉండగా, 2018-19లో 4,62,853కు చేరింది. బీఈడీలో చేరే వారి సంఖ్య కూడా 80శాతం పెరగడం గమనార్హం. 2014-15లో 6,57,194 ఉండగా.. 2018-19లో 11,75,517కు పెరిగింది.

2015-16 విద్యాసంవత్సరంలో ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే అండర్ గ్రాడ్యుయేట్ల సంఖ్య 7,21,506 అంటే సుమారు 9శాతం పడిపోయింది. పోస్టుగ్రాడ్యుయేట్ చేసే వారి సంఖ్య కూడా 32శాతం తగ్గిపోయింది. 2015-16లో 18,07,646 నుంచి 2018-19లో 12,36,404కు పడిపోయింది.
3.74 కోట్ల మంది ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరతారని భావించినప్పటికీ 3.66 కోట్ల మంది చేరారు. సర్వే ప్రకారం హైయ్యర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో(జీఈఆర్) 217-18లో 25.8శాతం నుంచి ఇప్పుడు 26.3శాతానికి పెరిగింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications