ఊపిరి పీల్చుకున్న మాజీ మంత్రి లింబావలి, రమేష్ రెడ్డి, జయరామ్ రెడ్డి !
బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరులో నివాసం ఉండే ప్రముఖ వ్యాపారి ప్రదీప్ కగ్గలిపురలో తన కారులో డెత్ నోట్ రాసి రివాల్వర్ తో కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో బెంగళూరులోని మహదేవపుర మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అరవింద లింబావళి తన ఆత్మహత్యకు కారణమని వ్యాపారి ప్రదీప్ రాశారు. అయితే డెత్ నోట్ లో రాసి ఉన్న ఆరోపణలకు ఆధారాలు దొరకని నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకుడు అరవింద లింబావళికి పెద్ద రిలీఫ్ లభించింది.
జనవరి 2న కాగలిపుర సమీపంలో వ్యాపారి ప్రదీప్ అతని కారులో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల్లో వ్యాపారవేత్త ప్రదీప్ తన కారులో ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అయితే వ్యాపారవేత్త ప్రదీప్ ఆత్మహత్య చేసుకునే ముందు అతను డెత్ నోట్ రాశాడు, అందులో 6 మంది పేర్లు ఉన్నాయి. తన చావుకు వ్యాపారి గోపి, వ్యాపారి సోమయ్య, మహదేవపుర ఎమ్మెల్యే అరవింద్ లింబావళి, వ్యాపారి జి. రమేష్ రెడ్డి, వ్యాపారి జయరాం రెడ్డి, వ్యాపారి రాఘవ భట్‌లు కారణం అని ప్రదీప్ అతని డెత్ నోట్ లో రాశాడు.

అయితే ఇప్పుడు ఈ కేసులో పోలీసులు కోర్టులో బి రిపోర్టు సమర్పించారు. వ్యాపారవేత్త ప్రదీప్ ఆత్మహత్య కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు సమర్పించిన బి రిపోర్టులో వివరించారు. ఆర్థిక సమస్యల కారణంగానే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చిందని పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు అరవింద లింబావలితో సహా 25 మంది వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి కూడా 4 పేజీల వివరణ ఇచ్చారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications