Cancer: క్యాన్సర్ రోగులకు బిగ్ రిలీఫ్- 1364 మందుల రేట్ల తగ్గింపు-3540 కోట్ల ఆదా..!

దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు (Cancer Patients) భారీ ఊరట. క్యాన్సర్ నివారణకు ప్రస్తుతం వాడుతున్న 1364 మందుల ధరల్ని భారీగా తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇవాళ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) ఉత్తర్వులు జారీ చేసింది. క్యాన్సర్ మందుల్నీ గరిష్ట ధరలకు అమ్ముతూ రోగుల్ని దోచుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తడం, దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పందించిన నేపథ్యంలో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని, అమలు చేస్తోంది.

ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..! CPS నుంచి OPSకి మారేందుకు మార్గదర్శకాలు..!

ఇవాళ్టి నుంచి 85 ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 121 ఔషధాలకు చెందిన 1364 క్యాన్సర్ నిరోధ మందుల ధరల్ని తగ్గించారు. దీంతో 679 బ్రాండ్ లకు చెందిన మందుల ధరలు 50 శాతం పైగా తగ్గినట్లు అత్యధికంగా ఇందులో 96.45 శాతం ధరలు కూడా తగ్గినట్లు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన ఫార్మాసుటికల్ విభాగం ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గత నెలలో సమర్పించిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫార్మా విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ 137 క్యాన్సర్ నిరోధక మందుల ఎమ్మార్పీలపై ఇచ్చే వాణిజ్య మార్జిన్లపై పరిమితి విధించింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.

Big Relief for Cancer Patients as Prices of 1 364 Anti-Cancer Drug Formulations Are Revised
ఏపీలో మరో ఎన్నికలు- ఓటర్ లిస్ట్ లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు మార్గదర్శకాలు..!
ఏపీలో మరో ఎన్నికలు- ఓటర్ లిస్ట్ లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు మార్గదర్శకాలు..!

క్యాన్సర్ మందులపై సవరించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేసేందుకు ఏ కెమిస్ట్ లేదా ఆస్పత్రి ఫార్మసీకి అనుమతి లేదని ప్రభుత్వం ఇవాళ తెలిపింది. ఎమ్మార్పీ, ఫార్మా సహీ దామ్ యాప్ లేదా అధికారిక ఎన్పీపీఏ వెబ్ సైట్ nppa.gov.in లోకి వెళ్లి రోగులు క్యాన్సర్ మందుల ధరల్ని సరిచూసుకోవచ్చని తెలిపింది. ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తుంటే వినియోగదారులు ఫార్మా జన్ సమాధాన్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, అలాగే 1800-111-255 హెల్ప్ లైన్ నంబర్ కు కానీ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ సిద్దం..! నోటిఫికేషన్ కు ముహుర్తం..!
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ సిద్దం..! నోటిఫికేషన్ కు ముహుర్తం..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+