ఫాస్టాగ్‌ వినియోగ దారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

జాతీయ రహదారులపై నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్ లకు సంబంధించిన ఫాస్టాగ్‌ ల కోసం ఇప్పటివరకు అమల్లో ఉన్న నో యువర్ వెహికల్ (KYV) ప్రక్రియ రద్దు కానుంది. KYV ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) తాజాగా వెల్లడించింది.

నూతన సంవత్సరం సందర్భంగా లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్రం నిర్ణయంతో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట లభించింది. కార్లు, జీపులు, వ్యాన్‌ లకు సంబంధించిన ఫాస్టాగ్‌ ల కోసం 'నో యువర్ వెహికల్'(KYV) ప్రక్రియను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులకు భారీ ఊరట లభించింది.

ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కేవైవీ పేరుతో వాహనదారులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఇబ్బందులు, జాప్యాన్ని నివారించేందుకే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నప్పటికీ, కేవైవీ అప్‌ డేట్ కావడం లేదన్న కారణంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని.. తాజా నిర్ణయంతో ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టేనని స్పష్టం చేసింది.

Big Relief for FASTag Users NHAI Scraps KYV Process for Cars from Feb 2026

అయితే కొత్త ఫాస్టాగ్ లకు మాత్రమే కాకుండా ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్ లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని రవాణాశాఖ పేర్కొంది. ఫాస్టాగ్ దుర్వినియోగం చేయడం.. తప్పుగా జారీ చేయడం వంటి ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే KYV అవసరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. లక్షలాది మంది వాహనాదారులకు ప్రక్రియను సులభతరం చేస్తూనే.. వ్యవస్థలో పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+