యోగీ ఆదిత్యనాథ్ కు సుప్రీం షాక్- 17 లక్షల మదర్సా విద్యార్ధులకు ఊరట..!
ఉత్తర్ ప్రదేశ్ లో లక్షలాది మంది ముస్లిం విద్యార్ధులు చదువుతున్న మదర్సా విద్యను రద్దు చేసి సాధారణ విద్య అభ్యసించాల్సిందేనని పట్టుబట్టిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ కు సుప్రీంకోర్టులో ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. 2004 నాటి మదర్సా చట్టం ప్రకారం యూపీలోని 16 వేల మదర్సాల్లో 17 లక్షల మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. అయితే మతపరమైన కారణాలతో యోగీ సర్కార్ వీటిని రద్దు చేసింది.
యూపీలో 16 వేల మదర్సాలను రద్దు చేసిన యోగీ సర్కార్ నిర్ణయాన్ని గతంలో అలహాబాద్ హైకోర్టు సమర్దించింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. యూపీలో 2004 నాటి మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.

మదర్సా బోర్డు ఏర్పాటు రాజ్యాంగంలోని లౌకికతత్వానికి విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదర్సా బోర్డు లక్ష్యాలు నియంత్రణ స్వభావం కలిగి ఉన్నాయని, బోర్డు స్థాపన సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ చట్టాన్ని కొట్టేసి విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది.
మదర్సాలు గణితం, సైన్స్, చరిత్ర, భాషల వంటి ప్రధాన సబ్జెక్టులలో లౌకిక విద్యను అందించడమే ఈ ప్రజాపప్రయోజన వాజ్యం ఉద్దేశ్యం అయితే, మదర్సా చట్టం 2004లోని నిబంధనలను రద్దు చేయడం పరిష్కారం కాదని ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications