కూటమికి బిగ్ షాక్...NDA నుంచి వైదొలిగిన ప్రధాన పార్టీ
దేశంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన NDAకు బిగ్ షాక్ తగిలింది. NDA నుంచి ప్రధాన పార్టీ బయటకు వచ్చేసింది. తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీ కూటమి నుంచి వైదొలిగింది. దీనిపై ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ..తమ పార్టీ ఇకపై NDAలో భాగస్వామ్యం కాదని ప్రకటించారు.
2026 ఎన్నికల ముందు తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని టీవీ దినకరన్ తెలిపారు.

అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన టీటీవీ దినకరన్ 2018లో 'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం' పార్టీని స్థాపించారు. అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం, పార్టీపై వ్యతిరేకతతో ఈ పార్టీని ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయిన తర్వాత దినకరన్ ఆర్కే నగర్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి, అప్పటి పాలక పక్షానికి షాక్ ఇచ్చారు.
ఇది ఏఎంఎంకే పార్టీకి ఒక ముఖ్యమైన విజయంగా చెప్పవచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ,లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.'అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం'పార్టీ ప్రస్తుతం గుర్తింపు పొందని (unrecognized) పార్టీగా కొనసాగుతోంది.
కూటమిలో ఉన్న పార్టీల నుంచి తమకు సరైన సహకారం లభించడం లేదని, అన్నాడీఎంకే వర్గాలను ఏకం చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంటూ దినకరన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ తదుపరి వ్యూహం గురించి డిసెంబర్ నెలలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications