రోడ్లు రక్తసిక్తం: బీహార్‌లో 17 మంది మృతి (వీడియో)
పాట్నా: శనివారం ఉదయం బీహార్‌లో వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో 17 మంది మరణించగా, 27 మంది గాయపడ్డారు. తొలుత ససరాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వేగంగా వస్తున్న ట్రక్కును లారీ ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వాజిర్‌గంజ్ పట్టణంలో వేగంగా వస్తున్న స్కార్పియోను ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications