ఎన్నికల సిత్రాలు: దున్నపోతుపై వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్!

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అనేక సిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఓ అభ్యర్థి తన నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై ఎక్కి రావడం గమనార్హం. బహదూర్‌పుర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాచారి మండల్ దున్నపోతుపై ఎక్కి దర్బాంగ వరకు చేరుకున్నారు.

ఆ తర్వాత అక్కడి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట అతని మద్దతుదారులు కూడా వచ్చారు. తనకు నాలుగు చక్రాల వాహనం లేదని.. అందుకే దున్నపోతుపై వచ్చినట్లు తెలిపారు. తాను బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకొచ్చారు.

Bihar Assembly election 2020: Independent candidate arrives on buffalo to file nomination

తాను వ్యవసాయ కూలి బిడ్డనని, తనకు నాలుగు చక్రాల వాహనం లేదని.. అందుకే తాను దున్నపోతుపై ఇలా తన నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు నాచారి మండల్. తాను ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు.
తనకు పేదలు, రైతుల మద్దతు ఉందని చెప్పారు.

తాను గెలిస్తే రైతులు, పేదలక ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని మండల్ తెలిపారు. ఇప్పటి వరకు తమ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదని, ఈ నేపథ్యంలో గత పాలకులపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపాడు.

Recommended Video

    Bihar Elections 2020 : 'Mahagathbandhan' Manifesto Key Highlights - Targets Farm Bills

    కాగా, ఘటనే గయాలోనూ జరిగింది. నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై వెళ్లిన అభ్యర్థిపై జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం కింద కేసు నమోదు చేశారు. బీహార్ అసెంబ్లీకి అక్టోబర్ 28 నుంచి మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్, 3, నవంబర్ 7న రెండు మూడు దశలు జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+