వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bihar Assembly Elections 2020:71 స్థానాలకు ప్రశాంతంగా ముగిసిన తొలిదశ పోలింగ్

|
Google Oneindia TeluguNews

మరికాసేపట్లో బీహార్ ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. అక్టోబర్ 28వ తేదీ బీహార్ రాష్ట్రం తొలి దశ ఎన్నికలకు వెళ్లనుంది. మొత్తం 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీకి తొలి దశలో 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

Bihar Assembly Election 2020 Live Updates:71 seats to go for polling in first phase

ప్రచారం సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. ఎన్డీయే తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉండగా మహాఘట్బంధన్ తరపున తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. అక్టోబర్ 28న తొలిదశ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా రెండో దశకు పోలింగ్ నవంబర్ 3వ తేదీ, మూడో దశకు పోలింగ్ నవంబర్ 7వ తేదీ జరుగుతాయి. నవంబర్ 10వ తేదీన ఫలితాలు వెలువడతాయి.

Newest First Oldest First
7:10 PM, 28 Oct

బీహార్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది
6:19 PM, 28 Oct

సాయంత్రం 5 గంటల సమయానికి 52.54శాతం పోలింగ్ నమోదు
6:07 PM, 28 Oct

15 ఏళ్లు నితీష్ కుమార్ పాలనలో బీహార్ పేదరికంలోనే మగ్గింది: రాహుల్ గాంధీ
5:24 PM, 28 Oct

జమ్మూకశ్మీర్‌లో కొత్త చట్టం తీసుకురావడంపై ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్
4:58 PM, 28 Oct

ముంగర్ కాల్పులపై హైకోర్టు నేతృత్వంలో విచారణ జరగాలని తేజస్వీ యాదవ్ డిమాండ్
3:58 PM, 28 Oct

కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్కులు ఎలా ధరిస్తున్నారో, బీహార్ నుంచి కాపాడుకునేందుకు ఎన్డీయేకు ఓటు వేయాలని కోరిన ప్రధాని మోడీ
3:57 PM, 28 Oct

మూడుగంటల సమయానికి 46.29శాతం పోలింగ్ నమోదు
2:33 PM, 28 Oct

సోషల్ మీడియాలో సీఎం నితీష్ కుమార్ కంటే తేజస్వీ యాదవ్‌కే ఎక్కువగా ఆదరణ ఉన్నట్లు తెలుస్తోంది
2:32 PM, 28 Oct

గయాలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సీఎం జితన్ మాంఝీ. 71 సీట్లకుగాను 50 సీట్లను ఎన్డీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన మాజీ సీఎం
2:31 PM, 28 Oct

మధ్యాహ్నం 1:30 గంటల సమయానికి 31.54శాతం పోలంగ్ నమోదు
1:19 PM, 28 Oct

అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాం. రాజకీయ నాయకులు ఎప్పుడు అడిగేవారు రామమందిరం నిర్మాణం ఎప్పుడు చేపడతారని. బీజేపీ లేదా ఎన్డీయే ప్రభుత్వం చెప్పింది చేసి తీరుతుంది. ఇది వారికి అర్థమై ఉంటుంది: ప్రధాని మోడీ
1:17 PM, 28 Oct

జహానాబాద్‌లో ఓటు వేసేందుకు వేచి చూస్తున్న దివ్యాంగుడు
1:15 PM, 28 Oct

జంగల్ రాజ్ అధికారంలోకి వస్తే కోవిడ్ నిధులు కచ్చితంగా దారి మళ్లుతాయి.ఆర్జేడీ గత రికార్డు ఎలా ఉందో నాకంటే మీకే బాగా తెలుసు: దర్బాంగా ప్రచారంలో ప్రధాని మోడీ
12:30 PM, 28 Oct

హిసువా అసెంబ్లీ స్థానంలోని ఓ పోలింగ్ బూతులో గుండెపోటు రావడంతో మృతి చెందిన ఏజెంట్
12:29 PM, 28 Oct

మహాఘట్బంధన్‌కు ఓటువేయాల్సిందిగా కోరుతూ ట్వీట్ చేసిన రాహుల్ గాంధీపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయి
12:28 PM, 28 Oct

బీహార్‌లో మందకొడిగా సాగుతున్న పోలింగ్.ఉదయం 11 గంటల వరకు 16.96శాతం మాత్రమే జరిగిన పోలింగ్
11:51 AM, 28 Oct

దర్బాంగాలోని రాజ్ మైదాన్‌లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
11:05 AM, 28 Oct

లఖీసరాయ్ జిల్లాలోని బాల్గుదార్ గ్రామ ప్రజలు ఓటింగ్‌ను బహిష్కరించారు.క్రీడా మైదానంలో మ్యూజియం నిర్మాణంను వారు వ్యతిరేకిస్తూ నిరసనగా ఓటింగ్‌ను బహిష్కరించారు: ప్రిసైడింగ్ అధికారి
11:04 AM, 28 Oct

ముంగార్‌లో జరిగిన లాఠీఛార్జీ కాల్పులకు ఎవరు బాధ్యులు..సీఎం నితీష్ జనరల్ డయ్యర్‌లా వ్యవహరిస్తున్నారు..? దీనికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి:ఎల్‌జేపీ నేత చిరాగ్ పాశ్వాన్
11:02 AM, 28 Oct

ససరాంలో ఓటువేసేందుకు పోలింగ్‌ బూతు వద్దకు చేరుకున్న ఓటర్లు.ఓటర్లకు టెంపరేచర్ చెక్, శానిటైజర్‌లు అందిస్తున్న సిబ్బంది
10:34 AM, 28 Oct

గయాలో ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ మంత్రి ప్రేమ్ కుమార్
10:21 AM, 28 Oct

బీహార్ మంత్రి ప్రేమ్ కుమార్ గయాలో ఓటువేసేందుకు పోలింగ్‌బూతుకు సైకిల్ పై వెళ్లారు
10:20 AM, 28 Oct

జముయిలోని బీజేపీ అభ్యర్థి షూటర్ శ్రేయాసీ సింగ్ నయాగావ్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు
9:54 AM, 28 Oct

ఔరంగాబాద్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు
9:08 AM, 28 Oct

గయాలోని పోలింగ్ స్టేషన్ వద్ద బారులు తీరిన ఓటర్లు
9:07 AM, 28 Oct

బీహార్‌లోని ఓ పోలింగ్ బూతును శానిటైజ్ చేస్తున్న సిబ్బంది
9:06 AM, 28 Oct

బీహార్‌లో ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి. కోవిడ్ నిబంధనలను పాటించండి:ప్రధాని మోడీ
8:36 AM, 28 Oct

అర్హాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో నిలబడ్డ ఓటర్లు
8:34 AM, 28 Oct

ప్రజాస్వామ్య పండగలో ప్రతి ఒక్కరూ పాల్గొని అదే సమయంలో కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరుతున్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
8:10 AM, 28 Oct

బిహార్

బిహార్ లఖీసరాయ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
READ MORE

English summary
Bihar is all set to go for the first phase of assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X