పూర్వవైభవం- ఈ నియోజకవర్గాలే కీలకం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్‌కు ఆరంభమైంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఓటు వేయడానికి తెల్లవారు జాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిల్చున్నారు.
మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. రెండు విడతలుగా జరిగే ఈ ఎన్నికల్లో పురుషులు- 3.92, మహిళలు- 3.5 కోట్ల మంది ఓటు వేయనున్నారు.

అలాగే 14 లక్షల మంది యువ ఓటర్లు ఈ ఎన్నికల ద్వారా బీహార్ భవిష్యత్ కు దిశా నిర్దేశం చేయనున్నారు. వయోధిక వృద్ధుల ఓటర్ల సంఖ్య నాలుగు లక్షలకు పైగా ఉంటోంది. మొదటి దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలను నెలకొల్పింది. రెండో విడత పోలింగ్ ఈ నెల 11వ తేదీన జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

Bihar Assembly elections 2025 Tejashwi and Lalu Yadav among early voters in 1st Phase

పాట్నా, దర్భంగా, మాధేపురా, సహర్సా, ముజఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సివాన్, సరన్, వైశాలి, సమస్తిపూర్, బెగుసరాయ్, లఖిసరాయ్, ముంగేర్, షేక్‌పురా, నలంద, బక్సర్, భోజ్‌పూర్‌ సహా 18 జిల్లాల్లో మొదటి దశలో పోలింగ్ సాగుతోంది. సామ్రాట్ చౌదరి- తారాపూర్, తేజస్వీ యాదవ్- రాఘోపూర్, తేజ్ ప్రతాప్- మహువా, మైథిలీ ఠాకూర్- అలీనగర్, అనంత్ సింగ్- మొకామా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికలతో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన నెలకొల్పిన జన్ సురాజ్ పార్టీ తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొటోంది. ప్రస్తుతం అందరి కళ్లూ దీని మీదే నిలిచాయి. ఓట్లను చీల్చుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బీహార్‌లో మూడవ ప్రత్యామ్నాయంగా తనను తాను పోటీలోకి దింపారు తన పార్టీని. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదు గానీ.. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టారు.

ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భక్తియార్ పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో విడత అధికారంలోకి వస్తోన్నామనీ, డబుల్ ఇంజిన్ సర్కార్ కు ఓటర్లు మళ్లీ గెలిపించబోతోన్నారని వ్యాఖ్యానించారు. తొలి రెండు గంటల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో తేజస్వి యాదవ్, రబ్రీ దేవి, లాలూ ప్రసాద్ యాదవ్, కేంద్రమంత్రులు చిరాగ్ పాశ్వాన్, నిత్యానంద రాయ్, ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి వంటి ప్రముఖులు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+