బీహార్ నుంచే అన్నీ మొదలు- 22లోగా అంతా ముగిస్తాం: సీఈసీ కీలక ప్రకటన

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది.. బీహార్. నవంబర్/డిసెంబర్ లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును కొనసాగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో అక్కడి ఏర్పాట్లను పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ ఎన్నికల్లో ఈవీఎం బ్యాలెట్‌పై అభ్యర్థుల ఫొటోలు రంగుల్లో కనిపించనున్నాయి. ఈ మార్పును అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా బిహార్ నిలవబోతోంది. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బీహార్ లో పర్యటిస్తోన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Bihar Becomes First State for Colorful EVM Ballots and Candidate Images

ప్రస్తుతం ఈవీఎం బ్యాలెట్లపై అభ్యర్థుల ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం వల్ల వారిని గుర్తించడం ఓటర్లకు కష్టతరమౌతోందని, ఎన్నికల చిహ్నాలు స్పష్టంగా ఉన్నప్పటికీ, ఫోటోల విషయంలో ఈ సమస్య ఎదురవుతోందని అన్నారు. సీరియల్ నంబర్ కూడా పెద్దదిగా ఉండాలని సూచనలు వచ్చాయని, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తోన్నామని పేర్కొన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా సీరియల్ నంబర్ ఫాంట్ పెద్దదిగా ఉంటుందని, అభ్యర్థుల ఫోటోలు రంగుల్లో ఉంటాయని అన్నారు.

ఈ మార్పులు మొదట బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే అమలులోకి రానున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు ఏ పోలింగ్ స్టేషన్‌లోనూ 1,200 మందికి మించి ఓటర్లు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. బూత్ స్థాయి అధికారులను గుర్తించడానికి ఐడీ కార్డులు ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. బూత్ స్థాయి సిబ్బందిని గుర్తించడానికి ఓటర్లకు ఈ ఐడీ కార్డులు ఉపయోగపడతాయని అన్నారు.

మొబైల్ ఫోన్‌లను బూత్ బయటే జమ చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ బిహార్ అంతటా అమలవుతుందని వివరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో 100 శాతం వెబ్‌కాస్టింగ్ తో కవర్ చేస్తామని జ్ఞానేష్ కుమార్ చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 22లోగా పూర్తవుతాయని, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) గడువులోగా పూర్తయిందని ప్రకటించారు. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు ఎస్టీలు, 38 ఎస్సీలకు కేటాయించినట్లు వివరించారు.

సోషల్ మీడియాపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని సీఈసీ చెప్పారు. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై తప్పుడు సమాచారం పోస్ట్ కాకుండా గట్టి పర్యవేక్షించాల్సి ఉందని, ఈ దిశగా కొన్ని చర్యలను తీసుకుంటామని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీ (యూ), ఆర్‌జేడీ, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్, సీపీఐ (ఎం), సీపీఐ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), బహుజన్ సమాజ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+