వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మార్కులు చూసి ఆత్మహత్య ఆలోచన: కానీ అసలు నిజం ఇది.. బీహార్‌లో 'మళ్లీ'

మెరిట్ స్టూడెంట్ అయిన పదో తరగతి విద్యార్థి ధనుంజయకు హిందీ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే వేశారు. పరీక్ష బాగా రాసిన ధనుంజయ.. తనకు వచ్చిన మార్కులు చూసి షాక్ తిన్నాడు.

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా మారిపోయింది. టాపర్స్ స్కామ్ మొదలు ఏదో ఒక వైఫల్యం బయటపడుతూనే ఉంది. తాజాగా ఓ మెరిట్ స్టూడెంట్ ను ఫెయిల్ చేసి మరో నిర్వాకాన్ని మూటగట్టుకుంది బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు.

షాక్ తిన్న ధనుంజయ

షాక్ తిన్న ధనుంజయ

మెరిట్ స్టూడెంట్ అయిన పదో తరగతి విద్యార్థి ధనుంజయకు హిందీ సబ్జెక్టులో కేవలం రెండు మార్కులు మాత్రమే వేశారు. పరీక్ష బాగా రాసిన ధనుంజయ.. తనకు వచ్చిన మార్కులు చూసి షాక్ తిన్నాడు. ఐఐటీలో చదవాలని కలలు కంటున్న విద్యార్థికి ఇలాంటి మార్కులు రావడం చాలామందినే ఆశ్చర్యపరిచింది.

అసలు మార్కులు ఇవి

అసలు మార్కులు ఇవి

ఈ నిర్వాకంపై ధనుంజయ ఆర్టీఐని ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.సమాచార హక్కు చట్టం కింద బాధిత విద్యార్థి హిందీ పేపర్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రీవాల్యుయేషన్‌లో 79 మార్కులు వచ్చాయి. ఆర్‌టీఐ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 500 మార్కులకు గాను ధనుంజయ్‌ 421 మార్కులు సాధించాడు.

ఆత్మహత్య చేసుకోవాలనకున్నాడు

ఆత్మహత్య చేసుకోవాలనకున్నాడు

బీహార్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్లక్ష్య వైఖరి ఎంతటి పరాకాష్టకు చేరిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో ధనుంజయ తీవ్ర నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించాడు. అదే జరిగి ఉంటే.. దానికి ఎవరు బాధ్యత వహించేవారు?.. హిందీలో ఫెయిల్ అవడం తన ఉన్నత విద్య కలలకు ఎక్కడ బ్రేక్ వేస్తుందోనని తీవ్రంగా ఆందోళన చెందాడు.

గత 6నెలలుగా అధికారులు చుట్టూ తిరిగినా తమనెవరూ పట్టించుకోలేదని ధనుంజయ సోదరుడు వాపోయాడు. ఒక్క హిందీ తప్పించి మిగిలిన అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులే వచ్చాయి. మొత్తంగా 84.2 శాతం రిజల్ట్ వచ్చింది. అయితే హిందీలో 79 మార్కులకు బదులు కేవలం 2 మార్కులు రావడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు.

గతంలోను ఇలాగే

గతంలోను ఇలాగే

ఎగ్జామినేషన్ బోర్డు మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం గమనార్హం. కాగా, గత అక్టోబర్‌లో బిహార్ బోర్డ్ మరో విద్యార్థికి కూడా ఇలాంటి షాకే ఇచ్చింది. సంస్కృతంలో 100కి 80 మార్కులువస్తే.. 9మార్కులు, సైన్స్‌ లో 61 మార్కులు వస్తే 29మార్కులు వేసి ఫెయిల్‌ చేసింది. మరో ఘటనలో ప్రియాంక కుమారి అనే విద్యార్థి హైకోర్టును ఆశ్రయించగా.. బోర్డు ఆమెను సెకండ్ టాపర్ గా ప్రకటించి తప్పును సరిదిద్దుకుంది.

English summary
The Bihar School Examination Board (BSEB) declared a student failed after giving him 2 marks in Hindi subject. However
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X