మహిళలకు గుడ్‌ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్‌

మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈ నిర్ణయంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పడతారని ప్రభుత్వం భావిస్తోంది. బిహార్ లోని మహిళలకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ ప్రకటించింది. ఈ మేరకు కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బిహార్ లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. ఈ ఏడాది చివర్లో బిహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నితీశ్ సర్కార్ కేబినేట్ సమావేశం నిర్వహించింది. మహిళలు, రైతుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు బిహార్ లోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీహార్‌లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌ ప్రకటించింది. అంతేకాక రైతులకు రూ. 100 డీజిల్ సబ్సిడీ ప్రకటించింది.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటినుంచే అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ సిద్ధమవుతున్నాయి. అయితే తాజాగా బిహార్ లోని నితీశ్ ప్రభుత్వం కేబినేట్ సమావేశం నిర్వహించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 43 స్కీమ్ లు, ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారు.

Bihar Boosts Women Empowerment 35 Job Quota for Local Women

బిహార్ యూత్ కమిషన్ ఏర్పాటు, స్థానిక మహిళలకు 35 శాతం రిజర్వేషన్, రైతులకు రూ. 100 డీజిల్ పై సబ్సిడీ తదితర పథకాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి కేవలం బిహార్ లో పుట్టి పెరిగిన మహిళలకే ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. హారిజాంటల్ విధానంలో ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లోని అన్ని పోస్టులకూ ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

మరోవైపు దేశంలో మొబైల్​ యాప్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రంగా బిహార్ రికార్డ్ నెలకొల్పింది. ఇటీవల రాష్ట్రంలోని ఆరు మున్సిపల్​ కౌన్సిల్లకు జరిగిన ఎన్నికల్లో ఈ విధానం అమలు చేశారు. పోలింగ్​ బూత్​ లకు చేరుకోలేని వయోవృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస కార్మికులతో పాటు ఇతరులు మొబైల్ యాప్​ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇది విజయవంతం కావడంతో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+