విపక్షాల ఐక్యతపై ముందడుగు-ఢిల్లీలో రాహుల్, ఖర్గేతో నితీశ్ కుమార్ కీలక చర్చలు...
దేశవ్యాప్తంగా బీజేపీ ఏకపక్ష విధానాలతో విసిగిపోయిన విపక్షాలు.. క్రమంగా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పలు ప్రాంతీయ పార్టీల నేతలు ఇతరులతో చర్చలు జరుపుతున్నారు. అలాగే భావసారూప్యత కలిగిన పార్టీల నేతలు కూడా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో బీహార్ లో మహాకూటమి భాగస్వాములైన జేడీయూ, కాంగ్రెస్ నేతలు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు.
ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు యువనేత రాహుల్ గాంధీని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ కలిశారు. నితీశ్ తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జేడీయూ అధినేత రాజీవ్ రంజన్ సింగ్ కూడా ఖర్గే, రాహుల్ ను భేటీ అయిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ కూ, ఇతర విపక్షాలకూ మధ్య దూరం తగ్గించేందుకు వీరు ఢిల్లీలో మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఇందులో భాగంగా ముందు కాంగ్రెస్ నేతల్ని కలిశారు. అనంతరం మిగతా విపక్షాల నేతలతో భేటీ కాబోతున్నారు.

ఇావాళ ఖర్గే, రాహుల్ తో జరిగిన భేటీలో బీహార్ సీఎం నితీశ్ కుమార్..విపక్షాల ఐక్యత అవసరాన్ని మరోసారి బలంగా గుర్తుచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కూ, ఇతర విపక్షాలకూ మధ్య సంధాన కర్తగా ఉంటూ విపక్షాలు ఉమ్మడిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ ను ఎదుర్కొనేలా చేయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. విపక్షాల మధ్య గ్యాప్ తగ్గించగలగడంతో పాటు వారికి కాంగ్రెస్ పై ఉన్న అనుమానాల్ని నివృత్తి చేసేందుకు నితీశ్ కదులుతున్నారు.
#WATCH | Today we had a historic meeting here and discussed many issues. We all have decided to unite all (opposition) parties and fight the upcoming elections unitedly: Congress President Mallikarjun Kharge pic.twitter.com/ds4ljcHsBZ
— ANI (@ANI) April 12, 2023
ఇవాళ ఢిల్లీలో ఓ చారిత్రక భేటీ జరిగిందని, అనేక అంశాలపై ఇందులో చర్చించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. అన్ని (ప్రతిపక్ష) పార్టీలను ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని తామంతా నిర్ణయించుకున్నామని ఖర్గే వెల్లడించారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇదో చారిత్రాత్మక అడుగని, ప్రతిపక్ష పార్టీల దార్శనికతను పెంపొందించుకుని ముందుకు సాగుతామని రాహుల్ గాంధీ వెల్లడించారు. దేశం కోసం అందరం కలిసికట్టుగా ఉంటామన్నారు.
#WATCH | This is a historic step to unite the opposition. We will develop the vision of the opposition parties and move forward; we will all stand together for the country: Congress leader Rahul Gandhi pic.twitter.com/S5iEupslzL
— ANI (@ANI) April 12, 2023
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్











Click it and Unblock the Notifications