నితీష్ వర్సెస్ తేజస్వి: AI ఫైనల్ తీర్పు ఇదే!
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025లో రికార్డు స్థాయిలో 69.9 శాతం పోలింగ్ నమోదు అయింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి నవంబర్ 14న రానున్న ఎన్నికల ఫలితాలపై ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు Grok, Perplexity, ChatGPT చేసిన విశ్లేషణ ప్రకారం, ఈసారి కూడా ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మహిళా ఓటర్ల అధిక భాగస్వామ్యం, నితీష్ కుమార్ స్థిరమైన నాయకత్వ ప్రతిష్ట ఎన్డీఏకు విజయాన్ని అందిస్తాయని ఏఐ అంచనా వేస్తోంది.
ఎన్డీఏ తిరిగి వస్తుందంటున్న గ్రోక్(Grok)
Grok ఏఐ అంచనాల ప్రకారం.. బీహార్ ప్రజలు ఈసారి కూడా నితీష్ కుమార్, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిపై విశ్వాసం చూపారు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి 130 నుండి 160 సీట్లు సాధిస్తుందని.. మహాకూటమి 85 నుంచి 100 సీట్ల మధ్య పరిమితం అవుతుందని అంచనా వేసింది. మహిళా ఓటర్ల భాగస్వామ్యం 71.6% (పురుషుల కంటే దాదాపు 9% ఎక్కువ) ఉండటం ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించిందని గ్రోక్ పేర్కొంది. "ముఖ్యమంత్రి నారీ శక్తి యోజన" వంటి పథకాలు మహిళలను నేరుగా ప్రభావితం చేయడంతో వారు ఎన్డీఏకు గట్టిగా ఓటు వేశారని అంచనా. ఓబీసీ, ఎస్సీ ఓటర్లు కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు. ఈ ట్రెండ్ కొనసాగితే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయం.

Perplexity: మహిళలే గేమ్-ఛేంజర్
Perplexity ఏఐ విశ్లేషణ ప్రకారం.. ఈ ఎన్నికల్లో అసలైన గేమ్-ఛేంజర్ మహిళా ఓటర్లే. ఈ ఎన్నికల్లో 140 నుండి 167 సీట్లు సాధిస్తుందని.. మహాకూటమి 70 నుండి 102 సీట్లు పొందే అవకాశం ఉందని Perplexity అంచనా వేసింది. నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన సామాజిక సంక్షేమ కార్యక్రమాలు - ముఖ్యంగా రూ.10,000 నగదు సహాయం, సైకిల్ పథకం, మహిళా గ్రూపులకు రుణాలు, ఉచిత విద్యుత్, మెరుగైన భద్రత - మహిళా ఓటర్లను ఆకర్షించాయి. మహిళలు పురుషుల కంటే అధికంగా ఓటు వేసిన ప్రాంతాల్లో 60 శాతం కంటే ఎక్కువ సీట్లలో ఎన్డీఏ ముందంజలో ఉండే అవకాశం ఉంది. తేజస్వి యాదవ్ ప్రకటించిన నెలకు రూ.2,500 పథకంపై ప్రజలు విశ్వాసం చూపలేదని, ఎందుకంటే నితీష్ ఇప్పటికే తక్షణ ప్రయోజనం కల్పించే పథకాలు ఇచ్చారని నివేదిక పేర్కొంది. జనసురాజ్ పార్టీ (ప్రశాంత్ కిషోర్) 0 నుంచి 5 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది.
ChatGPT: స్థిరత్వంపై ప్రజల విశ్వాసం
చాట్‌జీపీటీ ప్రకారం.. బీహార్ ప్రజలు స్థిరత్వం వర్సెస్ అస్థిరత అనే అంశంపై ఓటు వేశారు. ఎన్డీఏ కూటమి దాదాపు 147 సీట్లు సాధిస్తుందని.. మహాకూటమి సుమారు 90 సీట్లకే పరిమితం అవుతుందని చాట్‌జీపీటీ అంచనా వేసింది. అధిక పోలింగ్, ముఖ్యంగా మహిళల క్రియాశీల భాగస్వామ్యం, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బలహీనపరిచింది. గత ఐదేళ్లలో విద్యుత్, రోడ్లు, నీరు, శాంతిభద్రతలలో వచ్చిన మెరుగుదలలు గ్రామీణ ఓటర్లను ప్రభుత్వం వైపు ఆకర్షించాయి. నితీష్ కుమార్, బీజేపీ కూటమి 243 సీట్లలో దాదాపు 60 శాతం సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ట్రెండ్‌లు కొనసాగితే నితీష్ కుమార్ 2025లో మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటారు.
అంతిమ నిర్ణయం: ఎవరు గెలుస్తారు?
మూడు ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు (Grok, Perplexity, ChatGPT) దాదాపు ఒకే తీరులో ఫలితాలను అంచనా వేస్తున్నాయి. ఏఐ అంచనా ప్రకారం.. బీహార్ ప్రజలు మార్పు కంటే నమ్మకం వైపే మొగ్గు చూపారు. మహిళల చారిత్రక భాగస్వామ్యం, అభివృద్ధి పథకాల ప్రభావం నితీష్ కుమార్ 'స్థిరమైన నాయకుడు అనే ప్రతిష్ట ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇచ్చాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు తర్వాత ఏఐ అంచనా ఎంతవరకు నిజమవుతుందో తెలుస్తుంది. ప్రస్తుతానికి బీహార్ రాజకీయాలు మళ్లీ నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications