వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్‌కే పట్టం కట్టిన బీహారీలు: ఎవరేమన్నారు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. 243 స్థానాలకు గాను 155 స్ధానాల్లో స్పష్టమైన మెజారిటీ దిశగా జేడీయు కూటమి కొనసాగుతోంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు మాత్రమే కావాలి.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీని కట్టబెట్టిన ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. బీహార్ ప్రజలు మహాకూటమికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆశీర్వదించారని అన్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి పూర్తి ఆధిక్యంలోకి రావడం పట్ల ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి హర్షం వ్యక్తం చేశారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచిన జేడీయూ నేత నితీశ్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని ఆమె స్పష్టం చేశారు.

Bihar Election Results: Grand Alliance To Win, 10 Developments

మహాకూటమి విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా ఆయకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ చారిత్రక విజయం సాధించారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.

నితీశ్, లాలూ, బృందానికి నా అభిననందనలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సహనం గెలిచింది, అసహనం ఓడిందని అన్నారు. బీహార్ ఎన్నికల్లో ఓటమిని ప్రధాని మోడీ బాధ్యత తీసుకోవాలని శివసేన పేర్కొంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన మహాకూటమికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్, లాలూ జోడీ బీహార్‌లో ఎన్నికల్లో గొప్ప విజయం సాధించారని కొనియాడారు. మహాకూటమిలో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీలు ఉన్నాయి.

English summary
The Grand Alliance led by Bihar Chief Minister Nitish Kumar is set to win the Bihar assembly election on a dramatic Sunday morning that has seen unprecedented confusion as votes are counted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X