Bihar Elections Exit Polls 2020:డెవలప్, నిరుద్యోగిత కీలకాంశాలు.. పనిచేయని మోడీ, నితీశ్ ప్రభ
బీహర్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. అయితే మూడుసార్లు వరసగా సీఎం పదవీ చేపట్టిన నితీశ్ కుమార్‌పై వ్యతిరేకత కనిపించింది. అయితే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ వివిధ అంశాలను బేస్ చేసుకొని లెక్కగట్టింది. ఓవరాల్‌గా ఎన్నిక ఎలా జరిగిందనే అంశాన్ని వివరించింది. అయితే ఇందులో అభివృద్ది, నిరుద్యోగిత అనే రెండు అంశాలు కీలకంగా మారాయి.

అభివృద్ది మంత్ర..
గత కొన్నేళ్లుగా బీహర్ అభివృద్దికి నోచుకోవడం లేదు. నేతలు మాటలు చెప్పడం కానీ.. నిజ రూపం దాల్చలేదు. అయితే మరోసారి నితీశ్ కుమార్‌కు అధికారం ఇచ్చేందుకు సుముఖంగా లేరు. రాష్ట్రాభివృద్ధి ప్రధాన అంశంగా మారింది. అభివృద్ది అంశం 42 శాతంగా ఉంది. ఇకనైనా డెవలప్ చేయాలని బలంగా కోరుకుంటున్నారు. తర్వాత నిరుద్యోగిత కీలకంగా మారింది. 30 శాతం మంది నిరుద్యోగ సమస్యపై తీవ్రంగా భావిస్తున్నారు. ఇకనైనా తమకు ఉపాధి చూపించాలని కోరుకుంటున్నారు.

పనిచేయని మోడీ, నితీశ్ ప్రభ
11 శాతం మంది ద్రవ్యోల్బణం గురించి ఆందోళన చెందారు. ఇక రాజకీయ పార్టీలు అంటే 3 శాతం మంది రాజకీయ పార్టీలపై అసంతృప్తితో ఉన్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని గుస్సా మీదున్నారు. ప్రధాని మోడీ అంటే 3 శాత మంది వ్యతిరేకత చూపించారు. ఎన్నికల్లో కులం 1 శాతం ప్రభావం చూపించింది. జాతీయ భద్రత 1 శాతంగా ఉంది. సీఎం నితీశ్ కుమార్ 1 శాతం మాత్రమే ప్రభావం చూపించారు.

మెజార్టీ 122 సీట్లు
బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి కావాలి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications