Bihar Exit Polls 2020: టీవీ-9 భారత్ వర్ష్ కూడా.. కూటమికే మెజార్టీ సీట్లు, రెండోస్థానంలో ఎన్డీఏ
బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. దాదాపు అన్నీ మహగడ్ బందన్ వైపు మొగ్గుచూపుతున్నాయి. లేదంటే హంగ్ ఏర్పడుతోందని చెబుతున్నాయి. కూటమి- ఎన్డీఏ మధ్య 5 నుంచి 10 సీట్ల తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే టీవీ-9 భారత్ వర్ష్ పోల్స్ లెక్కగట్టింది. ఈ సర్వే కూడా కాంగ్రెస్ కూటమికి మొగ్గుచూపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహగడ్ బందన్ 115 నుంచి 125 సీట్లు గెలుచుకుంటుందని లెక్కగట్టింది. ఎన్డీఏ 110 నుంచి 120 వరకు గెలుచుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు కావాలి. ఈ లెక్కన ఎల్జేపీ, ఇతరులు కీలక పాత్ర పోషిస్తారా అనే అంచనాలు నెలకొన్నాయి. ఎల్జేపీ 3 నుంచి 5 సీట్లు, ఇతరులు 10 నుంచి 15 సీట్ల వరకు గెలుచుకుంటుందని తెలిపింది.

బీహర్ అసెంబ్లీలో 243 నియోజకవర్గాలు ఉన్నాయి. మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. అక్టోబర్ 28వ తేదీన తొలి విడత.. ఈ నెల 3వ తేదీన రెండో విడత ఎన్నికలు జరిగాయి. శనివారం ఇవాళ మూడో విడత 78 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా.. అధికారం చేపట్టాలంటే 122 సీట్లు తప్పనిసరి.












Click it and Unblock the Notifications