Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరదల్లో 40 మంది మృతి.. హెలికాప్టర్ల ద్వారా ఆహార సామాగ్రి పంపిణీ

పాట్నా : బీహార్‌లో వరదలు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకు పోయాయి. రాష్ట్ర రాజధాని పాట్నాతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా ఇప్పటిదాకా 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. ఆ మేరకు బీహార్ విపత్తు నిర్వహణ సంస్థ ఈ వివరాలు ప్రకటించింది.

భారీగా కురుస్తున్న వర్షాలతో బీహార్ వరదమయంగా మారింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఐఏఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అదలావుంటే ఎయిర్ ఫోర్స్ బృందాలు వరద ప్రాంతాల్లో చిక్కుకు పోయిన బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహారంతో పాటు ఇతరత్రా సామాగ్రిని అందిస్తున్నాయి. ఇక పాట్నాలోని కంకర్ బాగ్ ఏరియాలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్లు తదితర వాహనాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Bihar Flood Died 40 people IAF chopper drops relief material in Patna

వరదల కారణంగా బీహార్ మొత్తం నీట మునిగింది. పాట్నాలో ఎక్కడ చూసినా రోడ్ల మీదే నీరే కనిపిస్తోంది. వరదల కారణంగా డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ కూడా ఇబ్బందులు పడక తప్పడం లేదు. రెండు మూడు రోజులుగా తన నివాసంలో చిక్కుకు పోయిన సుశీల్ మోడీని సోమవారం నాడు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలించారు.

వరదల కారణంగా బీహార్ రాష్ట్ర ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. మోకాళ్ల లోతు నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం నిత్యావసరాల కోసం బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో వరద బాధితులకు ఆహార సామాగ్రితో పాటు ఇతర వస్తువులను హెలికాప్టర్ ద్వారా కిందకు జార విడుస్తున్నారు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+