భూకంపం: మాజీ ఎమ్మెల్యే ఫోన్‌నుండి మెసేజ్, నా పనే కానీ అని కొడుకు

పాట్నా: మరోసారి భూకంపం వస్తుందని సందేశాలు పంపించిన బీహార్ మాజీ ఎమ్మెల్యే పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోసారి పెను భూకంపం రాబోతోందంటూ వాట్సప్‌, ఇతరాల ద్వారా మెసేజ్‌లు పంపించడంతో నర్పత్‌గంజ్‌కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

ఆర్జేడీ నేత దయానంద్‌ రాయ్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1990 నుండి 2000 వరకు ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. శనివారం రాత్రి మళ్లీ పెను భూకంపం రాబోతోందని ఆయన మెసేజ్‌లు పంపడంతో ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారని పోలీసులు చెప్పారు.

దీంతో ఆయనపై సెక్షన్‌ 505 కింద కేసు నమోదు చేశామన్నారు. ఆ మెసేజ్‌లకు తన తండ్రికి సంబంధం లేదని, వాటిని పంపింది తానేనని దయానంద్‌ కుమారుడు రాజేశ్‌ కుమార్‌ వెల్లడించారు. తనకు వచ్చిన ఓ మెసేజ్‌ను పూర్తిగా చదవకుండానే ఇతరులకు పంపానని అయితే, వెంటనే పొరపాటును గ్రహించి క్షమాపణ కూడా చెప్పానని తెలిపారు.

Bihar former MLA charged for spreading Earthquake rumors

నీరు, ఆహారం లేక ఇబ్బందులు

నేపాల్లో భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య దాదాపు ఐదున్నర వేలకు చేరింది. మరోవైపు, ఆహారం, నీరు లేక ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. సాయం వెల్లువెత్తుతున్నా అది అందే మార్గం లేకపోవడంతో వేలాది మంది ప్రజల్ని ఆకలి మంటలు పీడిస్తున్నాయి. ఓ పక్క వర్షాలు, మరో పక్క ఎముకలు కొరికేసే చలిలోనే వీరి జీవనం సాగుతోంది. ఎవరో వస్తారన్న ఎదురుచూపుల ఆశలతోనే ఆహాల పొట్లాల కోసం హెలికాప్టర్ల కోసం నిరీక్షిస్తున్నారు.

మూడు రోజులైనా వేలాది మందిని చేరుకునే పరిస్థితి లేకపోవడంతో ఇది ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన మరింత తీవ్రమవుతోంది. సుదూర ప్రాంతాల్లో కుప్పకూలిన భవనాల కింద పడి ఉన్న వారిని వెలికి తీయడంలో ఇంకెంత మాత్రం జాప్యం జరిగినా అది భయానక అంటు వ్యాధులకూ దారితీస్తుందన్న హెచ్చరికలు అందుతున్నాయి. బయట పడ్డ శవాలను బయట పడినట్టుగా అక్కడికక్కడే దహనం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+