Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్!

Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉచిత పథకాలు, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించారు. ఇప్పటికే మహిళా రిజర్వేషన్లు, పెన్షన్ పెంపు వంటి నిర్ణయాల తర్వాత.. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం లభించింది. అయితే కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది.

ఉచిత విద్యుత్ పథకం ప్రయోజనం రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు లభిస్తుందని చెబుతున్నారు. ఇంధన శాఖ తరఫున 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడానికి ఒక ప్రతిపాదన సిద్ధం చేయబడింది. ఈ ప్రతిపాదనను మొదట ఆర్థిక శాఖకు పంపగా.. అక్కడి దీనికి ఆమోదం లభించింది. ప్రతిపాదన ప్రకారం.. వినియోగదారులు 100 యూనిట్ల వరకు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ వినియోగిస్తే యూనిట్‌‌కు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

Bihar Government Plans 100 Units Free Electricity for Every Household

ఈ ఉచిత విద్యుత్ పథకం రూపురేఖలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియదు. కేబినెట్ ఆమోదం తర్వాతే వినియోగదారులు ఈ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో తెలుస్తుంది. ఈ పథకం ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం పొందడానికి కారణం.. దీని ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మొదటి 50 యూనిట్లకు వినియోగదారులకు యూనిట్‌కు 7.57 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత 7.96 రూపాయలు వసూలు చేయబడుతుంది.

సామాజిక భద్రత పెన్షన్ పెంపు
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం సామాజిక భద్రత పెన్షన్ పథకంలో పెంపును ప్రకటించారు. దీని ప్రకారం.. పెన్షన్ ఇప్పడు ఇస్తున్న 400 రూపాయలకు బదులుగా రూ.1100 లభిస్తుంది. పెంచిన పెన్షన్ మొత్తం జులై నుంచి ప్రారంభమవుతుందని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా కోటి 9 లక్షల 69 వేల మందికి పైగా లబ్ధిదారులకు ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు.

మహిళలకు 35 శాతం రిజర్వేషన్ ప్రకటన
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా సాధికారతే లక్ష్యంగా.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలలోని ప్రతి విభాగంలో 35 శాతం పోస్టులు మహిళల కోసం రిజర్వ్ చేయబడతాయని సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. కార్మిక శక్తిలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. తద్వారా ఎక్కువ మంది మహిళలు కార్మిక శక్తిలో చేరి బీహార్ పాలనలో కీలక పాత్ర పోషిస్తారని సీఎం పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+