పోలీసుల రివాల్వర్ లాక్కొని కాల్పులు జరిపిన హంతకుడు, కొట్టి చంపేసిన గ్రామస్తులు !
ముజఫర్ పుర్: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టి చంపేసిన ఘటన బీహార్ లోని రాజారామ్ పుర్ ప్రాంతంలో జరిగింది. రాజారామ్ పుర్ గ్రామంలో నివాసం ఉంటున్న అనుజ్ శశి అనే వ్యక్తి హత్యకు గురైనాడని మంగళవారం పోలీసులు చెప్పారు.
రాజారామ్ పూర్ ఉప సర్పంచ్ కుమారుడిని అనుజ్ శశి హత్య చేశాడు. కొన్ని రోజుల నుంచి అనుజ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులు చివరికి అతన్ని అరెస్టు చేసి పోలీసు జీప్ లో తరలించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో నిందితుడు పోలీసుల దగ్గర ఉన్న రివాల్వర్ లాక్కొని జీపులో నుంచి కిందకు దూకేశాడు.

పోలీసుల మీద కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. పోలీసులను బెదిరిస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో రాజారామ్ పుర్ గ్రామస్తులు అనుజ్ శశిని వెంబడించారు. ఆ సమయంలో అనుజ్ శశి రివాల్వర్ తో గ్రామస్తుల మీద కాల్పులు జరిపాడు.
బుల్లెట్ తూటాలు దూసుకుపోవడంతో ఒకరికి తీవ్రగాయాలైనాయి. సహనం కోల్పోయిన గ్రామస్తులు అనుజ్ శశిని వెంబడించి పట్టుకుని కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేసి దారుణంగా చంపేశారు. అనుజ్ శశిని హత్య చేసే సమయంలో కొందరు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications