బీహార్ ఎన్నికలు: తుది దశ పోలింగ్లో ఓటర్లు
పాట్నా: బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న తుది దశ పోలింగ్ గురువారం శాంతియుతంగా జరుగుతున్నది. గురువారం ఉదయం 7 గంటల సమయంలో పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఈ ఐదవ తుది దశ పోలింగ్ 9 జిల్లాల్లో జరుగుతున్నది.
57 స్థానాలలో 827 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిమాంచల్ లో 24 స్థానాలు, మిథులాంచల్, కోషి ప్రాంతాల్లోని 33 స్థానాలలో శాంతియుతంగా పోలింగ్ జరుగుతున్నది. ఈ తుది దశ పోలింగ్ లో మొత్తం 1,55,43,594 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరకుండ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సున్నితమైన ప్రాంతాలలో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. క్రిమినల్ కేసులు ఉన్న వారు పోటి చేస్తున్న నియోజక వర్గాల మీద పోలీసులు నిఘా వేశారు.
ఉదయం నుంచి ఓటర్లు స్వచ్చందగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగడానికి అధికారులు ఎర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటల సమయానికి 30 శాతం పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications