షాక్: కారు, బంగ్లా నచ్చలేదని మంత్రి పదవికి రాజీనామా -బ్యూరోక్రసీపై ఆగ్రహం -సీఎం సీటుకు బీజేపీ ఎసరు?

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సంకీర్ణ ప్రభుత్వం.. అందునా తక్కువ సీట్లున్న పార్టీ నేత ముఖ్యమంత్రిగా కొనసాగడం ఎంత కష్టమో బీహార్ అప్ డేట్లను ఫాలో అయితే ఇట్టే అర్థమవుతుంది. వెనుకబడిన బీహార్ లో ఇంకా వెనుకబడిన దళిత, గిరిజనుల కోసం పనిచేసే సోషల్ వెల్ఫేర్ శాఖకు మంత్రి అనూహ్య కారణాలతో రాజీనామా చేశారు..

బీహార్ మంత్రి మదన్ సాహ్ని గురువారం తన పదవికి రాజీనామా ప్రకటించారు. జేడీయూలో సీనియర్ నేత అయిన సాహ్నికి సామాజిక సేవకుడిగానూ పేరుంది. పంచాయితీ వార్డు మెంబర్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగిన ఆయనకు వివాదరహితుడనే ఇమేజ్ కూడా ఉంది. దర్భాంగ జిల్లా బహదూర్ పూర్ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే..

Bihar Minister Madan Sahni resigns after not being happy with car and house he received

బీహార్ లో కరడుగట్టిన బ్యూరోక్రసీ రక్కసి కారణంగానే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మదన్ సాహ్ని తెలిపారు. ఆయన ఎస్సీ కానప్పటికీ, సామాజిక సేవలో అనుభవం దృష్ట్యా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా అవకాశం దక్కింది. అయితే, పదవి చేపట్టిన నాటి నుంచే ప్రభుత్వాధికారులతో ఆయన వైరం మొదలైంది. తనకు కేటాయించిన కారు, బంగళా సరిగా లేవంటూ సాహ్ని మంత్రి పదవిని వదులుకున్నారు.

ప్రభుత్వాధికారులు తనకు మంచి కారు, బంగళా కేటాయించకపోవడం వల్లే సరిగా పనిచేయలేకపోతున్నానన్న మదన్ సాహ్ని.. ఈ ఏడాది ప్రారంభం లోనే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ అటు నుంచి ఎలాంటి రెస్సాన్స్ రాలేదు. దీంతో భంగపడ్డ మదన్ ఇప్పుడేకంగా మంత్రి పదవినే వదులుకున్నారు. బ్యూరోక్రాట్ల తీరు నచ్చక పదవి నుంచి వైదొలుగుతున్నానన్న మదన్ సాహ్ని రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంకా ఆమోదించలేదు. కాగా,

Bihar Minister Madan Sahni resigns after not being happy with car and house he received

జేడీయూ మంత్రి మదన్ సాహ్ని రాజీనామా వెనుక బీజేపీ నేతల ప్రమేయం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. గతేడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమి విజయం అంచులదాకా చేరగా, పది సీట్ల తేడాతో ఎన్డీఏ కూటమి గెలుపొందడం, 74 సీట్లు సాధించిన బీజేపీ.. కేవలం 43 సీట్లున్న జేడీయూకు సీఎం పదవి ఇచ్చేయడంతో నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి కావడం తెలిసిందే. అయితే, బీహార్ సీఎం పదవిపై కన్నేసిన బీజేపీ.. నితీశ్ ను క్రమంగా బలహీనపర్చే ఎత్తుగడలను అనుసరిస్తున్నట్లు వినికిడి. మంత్రి మదన్ సాహ్ని రాజీనామా కూడా అందులో భాగమే కావొచ్చనే కామెంట్లు వస్తున్నాయి. మంత్రి రాజీనామాపై ఇటు జేడీయూ, అటు బీజేపీ స్పందించాల్సిఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+