తగ్గుతోన్న నితీశ్ ప్రజాధరణ..అయినా, సీఎం రేసులో రెండో ప్లేస్‌లో తేజస్వి.. చిరాగ్ 5 శాతమే..
బీహర్ ప్రజల మూడు మారుతోందా..? వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందనే అంశాలపై లోక్‌నితీ-సీఎస్‌డీఎస్ ఓపినీయన్ పోల్ నిర్వహించింది. అయితే ఇందులో నితీశ్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. నితీశ్ ప్రభుత్వంపై ప్రజా విశ్వాసం 28 శాతానికి చేరిందని సర్వేలో తేలింది.

ఒపినీయన్ పోల్..
బీహర్ ప్రజల నాడీ తెలుసుకునేందుకు లోక్ నీతి ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సర్వే చేపట్టింది. నితీశ్ ప్రభుత్వం.. ఎన్డీఏ కూటమిపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అంతేకాదు జనం ఎందుకు నితీశ్ పాలనపై విసుగెత్తిపోయారనే అంశాన్ని కూడా చర్చించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. వరసగా మూడుసార్లు సీఎం పదవీ చేపట్టడంతో ప్రజల్లో వ్యతిరేకత... 42 నుంచి 43 శాతానికి చేరింది.

అంశాల వారీగా వివరాలు
బీహర్ ఎన్నికల్లో 29 శాతం అభివృద్ది, నిరుద్యోగిత 20 శాతం, ద్రవ్యోల్బణం 11 శాతం, పేదరికం 6 శాతం, విద్య 7 శాతం ప్రభావం చూపుతోందని సీఎస్ డీఎస్ సర్వేలో తేలింది. అయితే 30 శాతం మంది బీహరీలో నితీశ్ కుమార్ తదుపరి సీఎంగా ఉండాలని కోరుకున్నారు. ఆర్జేడీ తేజస్వి యాదవ్‌కు 27 శాతం మంది మద్దతు పలికారు. ఎన్నికల్లో హాట్ టాపిక్ అవుతోన్న ఎల్జేపీ చిరాగ్ పాశ్వాన్‌ను కేవలం 5 శాతం మంది తదుపరి సీఎం అయ్యేందుకు అంగీకరించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ.. 4 శాతంతో సరిపెట్టుకున్నారు.
Recommended Video

20 శాతం మంది ఇలా..
20 శాతం మంది మాత్రం ఎన్డీఏకు అధికారం ఇవ్వాలా వద్దా అంశాన్ని తేల్చలేదు. అలా అయితే సీఎం పదవీ రేసులో ఉన్న తేజస్వి యాదవ్.. సుశీల్ కుమార్ మోడీ కలిసినా... కూటమి ఏర్పడేందుకు తగిన బలం సంపాదించలేకపోతారు. 2015లో 80 శాతం మంది ప్రజలు నితీశ్ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ అదీ ఇప్పుడు 52 శాతానికి చేరింది.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్‌లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications