బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అలా ఓటువేసేందుకు మొగ్గు చూపుతున్న సీనియర్ సిటిజెన్లు

పాట్నా: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తొలి దశ పోలింగ్‌కు తమ అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇక శివసేన కూడా ఈ ఎన్నికల్లో పోటీచేస్తోంది. ఇప్పటికే 50 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక నితీష్ కుమార్ జేడీయూ బీజేపీలు కలిసి పోటీచేస్తున్నాయి. మొత్తానికి బీహార్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఆసక్తికర విషయం తెరపైకొచ్చింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉన్న 52వేలమంది సీనియర్ సిటిజెన్లు , దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారని ఎన్నికల సంఘం సోమవారం రోజున తెలిపింది. 16 జిల్లాల్లోని 71నియోజకవర్గాలకు చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్లు 4 లక్షల మందిని కలిసి వారి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 80 ఏళ్ల వయసున్న వృద్ధులు, దివ్యాంగులు తమకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పించాలని కోరారు. ఇక మిగతా వారంతా నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేస్తామని వెల్లడించారు. ఇక ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని కోరారో వారికి ముందుగానే పోలింగ్ తేదీని ప్రకటించి రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

Bihar Polls: 50,000 senior citizens opt for Postal Ballot,says EC

ఇక బీహార్లో జరిగే మరో రెండు దశల పోలింగ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరగనున్న ఉపఎన్నికలకు కూడా ఈ తరహా విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పోస్టల్ బ్యాటెల్ విధానం ద్వారా పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్ 3వ తేదీ నవంబర్ 7వ తేదీ జరిగే ఎన్నికలకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటిని సందర్శించి 12 లక్షల మంది ఓటర్ల నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటారని ఎన్నికల సంఘం వివరించింది.

పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగే పోలింగ్ ఇతర ఉద్యోగస్తులు వినియోగించుకునే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు వేరుగా ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ముందుగా ఒక ఫారం నింపి దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆ పై అధికారులు ప్రతి ఇంటికి బ్యాలెట్‌ను తీసుకెళతారు. వీడియో రికార్డింగ్ సమక్షంలో ఆ ఫారంను బ్యాలెట్ బాక్సులో వేయడం జరుగుతుంది. తద్వారా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో పారదర్శకత ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+