బీజేపీ గెలుపు ధీమా: భారీగా లడ్డూలు సిద్ధం చేసిన శ్రేణులు -కొద్ది గంటల్లో బీహార్ ఎన్నికల ఫలితాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి గతంలో చాలా సార్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారయ్యాయి. ఈసారి తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందన్న అంచనా కూడా అలాంటిదేనని, బీహార్ లో మళ్లీ గెలవబోయేది బీజేపీ-జేడీయూ కూటమే అని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కౌంటింగ్‌ నేపథ్యంలో ముందుగానే భారీగా స్వీట్లు తయారు చేస్తున్నారు.

గెలుపుపై ఏమాత్రం ధీమా సడలబోదని, మంగళవారం నాటి కౌంటింగ్‌, ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు సిద్ధమవుతున్నామని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానించాయి. పాట్నా సాహిబ్ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తలు సోమవారమంతా లడ్డూల తయారీలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటి విజయోత్సవ ర్యాలీల్లో వీటిని పంచుతామని కార్యకర్తలు తెలిపారు. కాగా

Bihar Polls: Confident of win, BJP workers prepare sweets ahead counting

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి బీహార్‌లో ఓట్ల లెక్కింపునకు అదనపు కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 38 జిల్లాలకు గానూ ఈసారి 55 కౌంటింగ్ కేంద్రాలు, 414 హాళ్లను సిద్దం చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. పాట్నాలో మాత్రం సిటీ పరిధిలోకి వచ్చే 14 నియోజకవర్గాల ఓట్లను కేవలం ఒకే కౌంటింగ్‌ కేంద్రంలో (ఏఎన్‌ కళాశాల) లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు.

కౌంటింగ్‌ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ (సీఆర్‌పీసీ) అమలు చేస్తున్నారు. ఫలితాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 59 కంపెనీలకు చెందిన పారామిలటరీ భద్రతా దళాలను రంగంలోకి దించారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలవకు ఫలితాల ట్రెండ్ వెల్లడయ్యే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+